పెళ్లైన తర్వాత కెరీర్ ను కొనసాగించాలని భావించే మహిళలకు( women ) ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.అమ్మ అయిన తర్వాత లక్ష్యాలను సాధించాలంటే ఆవాంతరాలు ఎదురవుతాయి.
అయితే వాడపల్లి అనూష( Vadapalli Anusha ) మాత్రం తనకు ఎదురైన సవాళ్లను దాటి కెరీర్ విషయంలో సక్సెస్ సాధించారు.విదేశాల్లో ఎంబీఏ చదవాలనే కలను ఎంతో కష్టపడి నెరవేర్చుకున్నారు.
వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురైనా వాటిని అధిగమించి కోటి రూపాయల స్కాలర్ షిప్ సాధించారు.
కాకినాడలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన అనూష గేట్ పరీక్ష రాసి వైజాగ్ లోని హెచ్.
పీ.సీ.ఎల్ లో( HPCL ) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా జాబ్ సాధించారు.అక్కడే పరిచయమైన నవీన్( Naveen ) ను 2017లో వివాహం చేసుకున్నారు.
భర్తతో కలిసి ఆడపడుచును చూడటానికి దుబాయ్ కు వెళ్లిన సమయంలో అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ ను చూసిన తర్వాత అలాంటి దానిలో చదవాలనిపించి జీమ్యాట్ కు ప్రిపేర్ అయ్యానని అనూష వెల్లడించారు.

సమయం కేటాయించడానికి ఇబ్బందులు ఎదురైనా 2021లో 700 జీమ్యాట్ స్కోర్( 700 GMAT score ) సాధించానని ఆమె తెలిపారు.నా లక్ష్యం వేరు కావడంతో మళ్లీమళ్లీ జీమ్యాట్ రాయగా రెండుసార్లు స్కోర్ తగ్గుతూ పోయిందని అనూష చెప్పుకొచ్చారు.భర్త ప్రోత్సాహంతో చివరిసారి ప్రయత్నించగా ఆ సమయంలో నేను గర్భవతినని ఆమె వెల్లడించారు.
ఈసారి 800కు 770 మార్కులు సాధించానని ఆమె అన్నారు.

నచ్చిన యూనివర్సిటీలకు ( universities )దరఖాస్తు చేసుకోగా నవంబర్ 11న పాప పుట్టిందని నేను వార్డ్ లో, పాప ఐ.సీ.యూలో ఉన్నామని పాప పుట్టిన మూడు రోజులకే ఇంటర్వ్యూ కాల్ రాగా నీరసం, ఒళ్లు నొప్పులను భరిస్తూ ఇంటర్వ్యూ పూర్తి చేశానని అనూష చెప్పుకొచ్చారు.అమెరికాలోని టాప్ బిజినెస్ స్కూల్స్ నుంచి పిలుపు రాగా టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చేరనున్నానని ఆమె అన్నారు.కోటి రూపాయల స్కాలర్ షిప్ తో పాటు ప్రతిష్టాత్మక ఫోర్టే ఫెలోషిప్ కు కూడా ఎంపికయ్యానని ఆమె పేర్కొన్నారు.
అనూష సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.







