సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ ముందు వాయిదా పడి ఈ మధ్యనే మళ్ళీ రీ స్టార్ట్ అయ్యింది.
అయితే కొద్దీ రోజుల షూట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు టీమ్ గ్యాప్ తీసుకున్నారు.
దీంతో మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కోసం వెళ్లారు.ఇదిలా ఉండగా షూట్ కు ఇంత గ్యాప్ రావడంతో త్రివిక్రమ్( Trivikram ) మీద ఫాన్స్ సీరియస్ అవుతున్నారు.అంతేకాదు ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కష్టమే అని అంటున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కానీ ఈ సినిమా షూట్( Guntur Karam Movie Shooting ) మొదలెట్టిన దగ్గర నుండి ఏదొక కారణంతో వాయిదా పడుతూనే ఉంది.
దీంతో అసలు రిలీజ్ కష్టమే మళ్ళీ వాయిదా పడుతుంది అనే రూమర్స్ వైరల్ అవుతుండగా టీమ్ క్లారిటీ ఇచ్చారు.ఇప్పటి వరకు తెరకెక్కించిన అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని ఎట్టా పరిస్థితుల్లో ఈ సినిమా 2024 జనవరి 13న రిలీజ్ అవ్వడం ఖాయం అంటున్నారు.
ఇందులో ఫ్యాన్స్ ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఈసారి డేట్ వాయిదా వేసే అవకాశం లేదని టాక్.ఈ సినిమాలో శ్రీలీల( Sreeleela ), మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.