ఇటీవల రోజుల్లో ఎక్కువ శాతం మంది తెల్ల జుట్టు సమస్య( Grey hair Problem )తో సతమతం అవుతున్నారు.వయసు పైబడిన వారు మాత్రమే కాదు చిన్న వయసు వారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు .
ఈ క్రమంలోనే తెల్ల జుట్టుతో బయటకు వెళ్లలేక కలర్స్ తో కవర్ చేస్తున్నారు.అయితే తెల్ల జుట్టు వచ్చాక బాధపడుతూ కూర్చోవటం కంటే రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతో మేలు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ హెయిర్ టోనర్( Hair Toner ) అద్భుతంగా సహాయపడుతుంది.
![Telugu Black, Care, Care Tips, Homemade, Latest, Thick, White-Telugu Health Telugu Black, Care, Care Tips, Homemade, Latest, Thick, White-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2023/07/Onion-Garlic-Hair-Toner-for-White-Hair.jpg)
వారానికి కేవలం ఒక్కసారి ఈ హెయిర్ టోనర్ ను వాడితే తెల్ల జుట్టు రమ్మన్నా రాదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.
అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలను( Garlic ) శుభ్రంగా పొట్టు తొలగించి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు( Onions ), దంచి పెట్టుకున్న వెల్లుల్లి, నాలుగు లవంగాలు, వన్ టేబుల్ స్పూన్ బియ్యం, రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకొని బాగా మరిగించాలి.పది నుంచి పన్నెండు నిమిషాల పాటు వాటర్ ను మరిగించి.
ఆపై స్ట్రైనర్ ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టోనర్ సిద్ధమవుతుంది.
ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.
![Telugu Black, Care, Care Tips, Homemade, Latest, Thick, White-Telugu Health Telugu Black, Care, Care Tips, Homemade, Latest, Thick, White-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2022/02/white-hair-hair-hair-care-hair-care-tips.jpg)
ఆపై తయారు చేసుకున్న టోనర్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను కనుక వాడితే తెల్ల జుట్టు( White hair ) దరిదాపుల్లోకి కూడా రాదు.
ఒకవేళ కొంచెం కొంచెం వైట్ హెయిర్ ఉన్న సరే క్రమంగా నల్లబడుతుంది.పైగా ఈ హెయిర్ టోనర్ ను వాడటం వల్ల హెయిర్ గ్రోత్( Hair Growth ) ఇంప్రూవ్ అవుతుంది.
మీ జుట్టు డబుల్ అవుతుంది.చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.