ప్రపంచానికి పొంచివున్న కోవిడ్ తరహా ముప్పు .. ఈసారి అమెరికా నుంచి, మళ్లీ ‘‘మాంసం’’ ద్వారానేనట..!!

నాలుగేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి( Covid ) ఇప్పుడిప్పుడే మానవాళిని విడిచిపెడుతోంది.కానీ శాస్త్రవేత్తలు మాత్రం అదేం నిజం కాదని .

 Covid-style Pandemic Could Easily Start In Us From Meat Supply Report Details, C-TeluguStop.com

కరోనా నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఎప్పుడో ఒక రోజున మళ్లీ దాడి చేస్తుందని హెచ్చరిస్తూనే వున్నారు.వారి హెచ్చరికల నేపథ్యంలో అమెరికాలోని( America ) హార్వర్డ్ లా స్కూల్, న్యూయార్క్ యూనివర్సిటీల నుంచి వచ్చిన నివేదిక ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది.

కోవిడ్ తరహా మహమ్మారి మరోసారి విజృంభిస్తుందని అది కూడా అమెరికా నుంచేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వేగంగా వ్యాపిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.

మిలియన్ల కొద్దీ పశువులు. వాటి బాగోగులు చూసుకునే వారికి, మాంసం ఎగుమతులు, దిగుమతులు( Meat Supply ) జరిగే చోట్ల పనిచేసే వారికి ఈ వైరస్ సోకుతుందని తెలిపారు.

ప్రపంచీకరణ అనేది సముద్రాలను, పర్వతాలను ఇతర సరిహద్దులను చెరిపివేసిందని తద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందగలదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Telugu America, Ashley Peterson, Corona, Covid Pandemic, Meat, Meat Supply, Nati

పెంపుడు జంతువులు, ఇతర ప్రయోజనాల కోసం అమెరికాలో ప్రతి ఏడాది 220 మిలియన్ల వన్యప్రాణులు దిగుమతి అవుతాయి.కుక్క, పిల్లి వంటి వాటితో పాటు మరెన్నో జంతువులు దేశానికి వస్తున్నాయని వారు తెలిపారు.వన్యప్రాణుల దిగుమతిదారుల ద్వారా దక్షిణ అమెరికా నుంచి 100 అటవీ క్షీరదాలను తీసుకురావొచ్చునని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇది కూడా వైరస్( Virus ) వ్యాప్తికి కారణం కావొచ్చునని సైంటిస్టులు అంటున్నారు.

Telugu America, Ashley Peterson, Corona, Covid Pandemic, Meat, Meat Supply, Nati

ఈ అధ్యయనంపై నేషనల్ చికెన్ కౌన్సిల్( National Chicken Council ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఆష్లే పీటర్సన్( Ashley Peterson ) స్పందించారు.సీడీసీ ప్రకారం.యునైటెడ్ స్టేట్స్‌లో మనుషులకు ఏవియన్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం చాలా అరుదన్నారు.

అయితే పంది, పౌల్ట్రీపామ్‌లలో పనిసేసే కార్మికులు పెను ప్రమాదం ముంగిట వుంటారని రాయల్టన్‌లోని వెర్మోంట్ లా అండ్ గ్రాడ్యుయేట్ స్కూల్‌లోని లా అసోసియేట్ ప్రొఫెసర్ డెల్సియానా విండర్స్ చెప్పారు.అక్కడ పనిచేసే కార్మికులకు రక్షణ చర్యలు చాలా తక్కువని ఆమె పేర్కొన్నారు.

దేశంలో పొలాలు, ఇతర వ్యవసాయ క్షేత్రాల్లో జంతువుల పెంపకంపై ఎలాంటి నియంత్రణ లేదని విండర్స్ అన్నారు.కానీ స్లాటర్ హౌస్‌పై నియంత్రణ వుందని, అది కూడా చాలదని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఫెడరల్ ప్రభుత్వం స్లాటర్‌హౌస్‌‌లపై పర్యవేక్షణను సడలించడంపై విండర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube