ప్రభుత్వాలు చేసే పని కస్తూరి ఫౌండేషన్ చేస్తుంది

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం కోతులాపురం, గుడిమల్కాపురం గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాలు లేక చిన్నారులు ఇబ్బంది పడుతున్నారని, ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని తెలుసుకున్న కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ ముందుకు వచ్చి, ఫౌండేషన్ తరుపున అంగన్వాడీలకు ఊరికి 5లక్షల వ్యయంతో అందంగా అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించి,వాటిపై చిన్నారులకు అవగాహన కోసం బొమ్మలు వేశారు.

 Kasturi Foundation Does What Governments Do, Kasturi Foundation, Kasturi Sri Cha-TeluguStop.com

ఆడుకునే చిన్నారుల చిత్రాలు తల్లి పాల ప్రాముఖ్యతను తెలుపుతూ గోడలపై ఆకట్టుకున్నాయి,పిల్లలకు ఆట వస్తువులను బహుమానంగా అందించారు.

అన్ని అంగన్వాడీల నిర్మాణం ఫౌండేషన్ తరుపున అందంగా తీర్చిదిద్దితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.ప్రభుత్వానికి కస్తూరి ఫౌండేషన్ చేసే సేవలు గుర్తుకొచ్చి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube