నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ( Nellore Government Hospital )ఒక్కరోజులోనే ఏకంగా ఆరుగురు మృతి చెందటంతో విషాదం చోటుచేసుకుంది.ఎంఐసియు వార్డులో( MICU ward ) ఈ ఘటన చోటుచేసుకుంది.
శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆక్సిజన్ అందక రోగులు చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.మరోపక్క అనారోగ్యం వల్లే మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి.
అంతేకాదు ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెప్పుకొస్తున్నారు.ఈ పరిణామంపై విచారణ జరుగుతామని ఆసుపత్రి వర్గాలు తెలియజేయడం జరిగింది.
ఇదే సమయంలో ఆసుపత్రి సూపరిండెంట్ సైతం.అనారోగ్యం కారణంగానే రోగులు చనిపోయినట్లు చెబుతున్నారు.
అయితే చనిపోయిన ఆరుగురు రోగులు సైతం వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అంతకుముందు కూడా పలు ఆసుపత్రులలో చూపించుకుని చివరికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారని ఆసుపత్రి వర్గాలు తెలియజేయడం జరిగింది.అటువంటి పరిస్థితులలో కూడా చికిత్స అందించడానికి ప్రయత్నం చేసినట్లు వారి పరిస్థితి విషమించటంతోనే చనిపోయినట్లు స్పష్టం చేస్తున్నారు.ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయి ఉంటే ప్రమాదం ఊహించటానికి చాలా దారుణంగా ఉంటుందని అంటున్నారు.
మరోపక్క ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఒక్కరోజే అంతమంది చనిపోయినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.