పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.ఎమ్మెల్యే చందర్ పై రెబల్స్ తిరుగుబావుటా ఎగురవేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పోటాపోటీ యాత్రలతో రామగుండం వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నారు.తాజాగా ఆ పంచాయతీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు చేరింది.
కాగా గత మూడు రోజుల క్రితం కరీంనగర్ లో రెబల్స్ తో మంత్రి కొప్పుల ఈశ్వర్ భేటీ అయ్యారు.అయితే పరిస్థితి మారకపోవడంతో పంచాయతీ కేటీఆర్ చెంతకు వచ్చింది.
ఈ నేపథ్యంలో కేటీఆర్ తో రామగుండంలోని అసంతృప్త నేతలు సమావేశం కానున్నారని సమాచారం.ఈ భేటీ తరువాత రెబల్స్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే ఎమ్మెల్యే చందర్ కు వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ, పాలకుర్తి జెడ్పీటీసీ సంధ్యారాణి, రాజిరెడ్డి, పాతిపెల్లి ఎల్లయ్య, మనోహార్ రెడ్డిలు జట్టు కట్టినట్లు తెలుస్తోంది.