నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు ”భగవంత్ కేసరి”( Bhagwant Kesari ) అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ఇక బాలయ్య బర్త్ డే రోజు భగవంత్ కేసరి టీజర్ కూడా రిలీజ్ చేయడంతో మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.
అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి రిలీజ్ డేట్ ను మేకర్స్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
దీంతో బాలయ్య( Balayya ) ఫ్యాన్స్ ఫుల్ సర్ప్రైజ్ అవ్వడమే కాకుండా ఖుషీగా కూడా ఉన్నారు.
ఈ సినిమాను దసరా బరిలో రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు కానీ రిలీజ్ డేట్ ఇప్పటి వరకు చెప్పలేదు.అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ప్రకటించారు.దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.
అలాగే ”భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది” అంటూ పోస్టర్ కూడా రౌద్రమైన పోస్టర్ రిలీజ్ చేయగా ఆకట్టు కుంటుంది.
ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్నటిస్తున్నాడు.కాగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా షూట్ ఇప్పటికే లాస్ట్ స్టేజ్ కు రాగా ఫాస్ట్ గా షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని అనిల్ భావిస్తున్నాడు.