సోయాబీన్ పంటకు( Soyabean Crop ) తీవ్ర నష్టం కలిగించే వాటిలో లూపర్ సూడోఫ్లుసియా ఇంక్లూడెన్స్ యొక్క లార్వా ఈ కీలక పాత్ర పోషిస్తుంది.ఈ లార్వాకు సంబంధించిన పెద్ద పురుగులు ముదురు గోధుమ రంగులో, ముందు బాగానే ఉండే రెక్కలు గోధుమ రంగులో ఉండి రాగి నుండి బంగారం రంగులో మెరుస్తూ ఉంటాయి.
ఆడ పురుగులు మొక్కల కింది భాగంలో ఉండే ఆకులపై గుడ్లు పెడతాయి.లార్వాలు పచ్చ రంగులో ఉంటాయి.
ఈ పిల్ల లార్వా పురుగులు( Looper Larva ) ఆకుల కింది భాగాన్ని తిని పై భాగాలను వదిలేస్తాయి.పెద్ద పురుగులు ఆకులు తినడం అంచులతో ప్రారంభించి ప్రధాన ఈనెను వరకు ఆకులు తినేస్తాయి.
సోయాబీన్ ఆకులపై( Soyabean Leaves ) రంద్రాలు జాలి రూపంలో ఏర్పడతాయి.ఈ పురుగులు పెరిగి పెద్దవయ్యాక పిందే, పూలు, కాయలను కూడా రంద్రాలు చేసి తిని తీవ్రంగా నష్టపరుస్తాయి.
మార్కెట్లో దొరికే తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకుని, ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేసుకున్నాకనే పొలంలో నాటుకోవాలి.
పక్వానికి త్వరగా వచ్చే రకాలను ఎంచుకుంటే వివిధ రకాల తెగుళ్లు, చీడపీడల బెడద( Pests ) కాస్త తక్కువగా ఉంటుంది.పంట పొలాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఏమైనా చీడపీడలు, తెగుళ్లు ఉన్నాయేమో తెలుసుకోవాలి.ఏవైనా చీడపీడలు ఆశించిన మొక్కలు కనిపిస్తే వెంటనే ఆ మొక్కలను పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.
పొలంలో అక్కడక్కడ పక్షి గూళ్లను ఏర్పాటు చేస్తే తెగుళ్ల లార్వాను అవి తినేస్తాయి.
సేంద్రీయ పద్ధతిలో ఈ లార్వాలను అరికట్టాలంటే పరాన్న జీవి కందిరీగలను పొలంలో వదలాలి.అలా కాకుండా రసాయన పద్ధతిలో ఈ లార్వాలను అరికట్టాలి అంటే మేథోక్సీఫెనోజైడ్ లేదా స్పీనేటోరం లాంటి కీటక నాశునులను ఉపయోగించి పంటను సంరక్షించుకోవాలి.