జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ గౌతమ్ ( Rashmi Gautham ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈమె ప్రస్తుతం సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.
రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్( Extra Jabardasth ) కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ( Sridevi Drama Company ) కార్యక్రమానికి కూడా ఈమె యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.
అయితే తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే కమెడియన్స్ అందరూ కూడా వారి పంచ్ డైలాగులతో స్కిట్లతో అందరిని నవ్వించారు.అయితే సీనియర్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆటో రాంప్రసాద్ ( Auto Ramprasad )ఈ మధ్యకాలంలో డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నారు.ఈ క్రమంలోనే ఆటో రాంప్రసాద్ తన స్కిట్ లో భాగంగా రశ్మిని ఏకంగా రాత్రికి రమ్మని పిలిచారు.
దీంతో రష్మీ నన్నెందుకు రమ్మన్నావు అంటూ ప్రశ్నించడంతో రాత్రి ఎందుకు రమ్మంటారో తెలీదా అంటూ తెగ సిగ్గు పడిపోయారు.

ఇలా రశ్మిని పట్టుకొని రాత్రికి రా అంటూ ఆటో రాంప్రసాద్ చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి ఇంద్రజ ( Indraja ) ఒక్కసారిగా ఏయ్ అంటూ అరవడంతో తేరుకున్నటువంటి ఆటో రాంప్రసాద్ ఊర్లో జాతర చేయాలి అందుకే పిలిచామండి అంటూ కవర్ చేసుకున్నారు.ఇలా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారడంతో పలువురు ఈ ప్రోమో పై యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు.ఇలా డబల్ మీనింగ్ డైలాగులతో పంచ్ లు వేయడం పట్ల నెటిజన్స్ తరచూ ఈ కార్యక్రమ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూనే ఉంటారు.







