తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే.రామ్ చరణ్ ( Ram charan )ఇప్పటివరకు నటించిన సినిమాలలో కొన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.
మరి కొన్ని ప్లాప్ గా కూడా నిలిచాయి.రామ్ చరణ్ నటించిన సినిమాలలో వినయ విధేయ రామ కూడా ఒకటి.
ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్( Vivek Oberoi ) విలన్ గా నటించిన విషయం తెలిసిందే.తాజాగా వివేక్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెప్పారు.
వివేక్ ని కొందరు నమ్మించి దారుణంగా మోసం చేశారట.దీంతో కోట్లల్లో నష్టపోయినట్టు తెలుస్తోంది.

మోసపోయినట్లు గ్రహించిన వివేక్ ఒబెరాయ్ దీనిపై పోలీస్ స్టేషన్( Police station )లో ఫిర్యాదు చేశారు.ముంబయిలోని అంథేరిలోగల ఎంఐడీసీ పోలీసస్ స్టేషన్‌లో తాజాగా ఈ ఫిర్యాదు చేశారు వివేక్ ఒబెరాయ్.కాగా పోలీసులు, వివేక్ ఒబెరాయ్ అకౌంటెంట్ తెలిపిన వివరాల మేరకు.ముగ్గురు వ్యక్తులు సినిమా ప్రొడక్షన్, ఈవెంట్‌లో వివేక్ ఒబెరాయ్ చేత కోటి 55లక్షలు ఇన్వెస్ట్ పెట్టించారు.
ఇందులో ఒక నిర్మాత కూడా ఉన్నారు.ఇందులో పెట్టుబడి పెడితే లాభాలు బాగున్నాయని చెప్పి ఆయన్ని నమ్మబలికారు.వారి మాటలు నమ్మిన వివేక్ రూ.1.55 కోట్లు ఇన్వెస్ట్ చేశారట.

ఆ డబ్బుని వాళ్ళు ఈవెంట్లు, సినిమా నిర్మాణాలు చేయకుండా తమ స్వలాభాలకు వాడుకున్నారట.అందులో నటుడి భార్య కూడా పార్టనర్‌గా ఉన్నారట.ఇక అకౌంటెంట్ ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురు వ్యక్తుల మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 34, 409, 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారట.
దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.తమ నటుడికి న్యాయం చేయాలని వివేక్ ఒబెరాయ్ అకౌంటెంట్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.నటుడు వివేక్ ఒబెరాయ్ తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నారు.







