Nandita Swetha : టాలెంట్ ఉంది …..కానీ అవకాశాలు ఎక్కడ?

సినీ పరిశ్రమలో నిలబడాలంటే అందం ముఖ్యమా లేక నటన ముఖ్యమా అనే చర్చ ఎప్పటినుంచో సాగుతోంది.కానీ ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు.

 No Offers To Heroine Nanditha-TeluguStop.com

ఐతే కొందరు హీరోయిన్ల పరిస్థితి చూస్తుంటే నటన కన్నా ఎక్కువ ప్రాధాన్యం అందానికే అనిపిస్తుంది.నందిత శ్వేత( Nandita Swetha )….

ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తేమి కాదు.నందిత ఇప్పటికే ఎక్కడికి పోతావు చిన్నవాడా, బ్లఫ్ మాస్టర్, సెవెన్ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు.

నటించడమే కాదు….తన నటనకు మంచి ప్రశంసలు కూడా అందుకున్నారు.

కానీ ఈ బెంగుళూరు ముద్దు గుమ్మకు అవకాశాలు మాత్రం అంతంత మాత్రం గానే ఉన్నాయ్.ఆమె తెలుగు, కన్నడ, తమిళ భాషలలో 25కు పైగా చిత్రాలలో నటించినప్పటికీ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పెద్ద సినిమా కాదు.

Telugu Bluff Master, Ekkadikipothavu, Hidimbi, Nandita Swetha, Nanditha, Tollywo

తాజాగా నందిత నటించిన చిత్రం “హిడింబ”.( Hidimba Movie ) ఈ చిత్రం జులై 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.శ్రీ విగ్నేష్ కార్తీక్ సినిమాస్ మరియు ఓ ఆ కే ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంకి అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు.అశ్విన్ బాబు హీరో.

ఈ చిత్రం లోను అదే వరస.ఈ చిత్రం మీద ప్రజల అభిప్రాయం సోసో గానే ఉన్న నందిత మాత్రం తన నటనతో మళ్ళీ అందరిని ఆకట్టుకుంటోంది.నటన పెద్దగా రాకపోయినా కేవలం గ్లామర్తో సినీ పరిశ్రమలో హీరోయిన్లుగా చలామణి అవుతున్నవారు చాలా మంది ఉన్నారు.కానీ నటన, అందం రెండు పుష్కలంగా ఉన్న నందిత మాత్రం ఇంకా అవకాశాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.

ఈ ప్రదర్శనతోనైనా ఆమె పెద్ద దర్శకుల కళ్ళలో పడుతుందో లేదో….వేచి చూడాల్సిందే.

Telugu Bluff Master, Ekkadikipothavu, Hidimbi, Nandita Swetha, Nanditha, Tollywo

నందిత శ్వేతా బెంగుళూరు లో 1990లో జన్మించారు.ఆమె మొట్ట మొదటిసారిగా 2008 లో “నంద లవ్స్ నందిత”( Nanda Loves Nanditha ) అనే కన్నడ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.2016 లో ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టారు.పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 8 సంవత్సరాలు కావస్తున్నా ఆమె తెలుగులో కేవలం పది సినిమాలే చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube