భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది.భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.
ప్రస్తుతం బ్రిడ్జి వద్ద నీటిమట్టం 41 అడుగులకు చేరుకుంది.ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయానికి 43 అడుగులకు చేరే అవకాశం ఉంది.
ఒకవేళ 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.మరోవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు.
ఈ క్రమంలోనే కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాలు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరున, పినపాక తహసీల్దార్ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.లోతట్టు ప్రాంత వాసులను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు.
అటు తాలిపేరు ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు.







