కామిక్ కాన్ లో ఎంటర్ అయిన 'ప్రాజెక్ట్ కే' టీమ్.. ఆర్మీ లుక్ తో క్రేజీగా వెల్కమ్!

గత కొద్దీ రోజుల నుండి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ”ప్రాజెక్ట్ కే”( Project K ) తరచు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.ఎప్పుడైతే ఇంటర్నేషనల్ సంస్థ శాన్ డియాగో కామిక్ కాన్ అనే ఈవెంట్ లో చోటు సంపాదించుకుంది అని ప్రకటన వచ్చిందో అప్పటి నుండి ప్రాజెక్ట్ కే పేరు మారుమోగి పోతుంది.

 Project K Army Crazy Look Viral In The World , Prabhas, Project K, Deepika Paduk-TeluguStop.com

ఇక ఈ రోజే అక్కడ ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది.

ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ కే టీమ్ మొత్తం ఎంతో ఆసక్తికాగా ఎదురు చూస్తున్న తరుణం రానుంది.ఈ భారీ మూవీ ప్రధాన టీమ్ అంతా ఈ ఈవెంట్ కోసం హాజరు అవుతున్నారు.ఇదే ఈవెంట్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ను రివీల్ చేయనున్నారు.

అందుకే ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) తో పాటు యావత్ ఇండియా మొత్తం మన తెలుగు సినిమా ప్రాజెక్ట్ కే కోసం హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు.
ఇక ఇది వరకే ఈ సినిమా నుండి ప్రాజెక్ట్ కే స్క్రాచ్ నుండి అని ఈ సినిమాలో సైన్యంకు సంబంధించిన సెట్ వర్క్స్ రిలీజ్ చేసారు.

ఇక ఇప్పుడు యూఎస్ లో తమ యూనిట్ కామిక్ కాన్ ఎసెంట్ దగ్గర తమ ఆర్మీ తాలూకా లుక్( Army Look ) ను అక్కడ రివీల్ చేశారు.తమ సినిమాకు వెల్కమ్ చెప్తూ వారి సూట్ లో కనిపించి సర్ప్రైజ్ చేసారు.

ఇన్ని అంచనాలను క్రియేట్ చేస్తున్న నాగ్ అశ్విన్ సినిమాను వేరే లెవల్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ రోజే యూఎస్ లో ఈ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ Project K Title Teaser ) కానుండగా రేపు ఇండియాలో రాబోతుండడంతో ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఇక ఇందులో దీపికా పదుకొనె, బిగ్ బి, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అయిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్( Vyjayanthi Movies Banner )< పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube