టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొంది వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో తదుపరి సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఒక అద్భుతమైన విజువల్ వండర్ ను ఆవిష్కరించాలి అనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.
విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే స్టోరీ లైన్ సిద్ధం చేయడం జరిగింది.

అంతే కాకుండా సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నట్లుగా పేర్కొన్నాడు.ఈ మధ్య కాలంలో విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ లు అన్ని కూడా అద్భుతం అన్నట్లుగా నిలిచాయి.అందుకే ఈ సినిమా కూడా ఒక అద్భుతం అన్నట్లుగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
అయితే ఈ సమయంలో రాజమౌళి అభిమానులు మహేష్ బాబు గురించి మాట్లాడుకుంటున్నారు.మహేష్ బాబు నెలలో 8 నుండి 10 రోజుల పాటు షూటింగ్ కు హాజరు అయి మిగిలిన రోజుల్లో పూర్తిగా విదేశాల్లో యాత్రలు అంటూ తిరుగుతూ ఉంటాడు.
గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) షూటింగ్ లో పది రోజులు పాల్గొన్నాడో లేదో అప్పుడే లండన్ ట్రిప్ కోసం ఫ్యామిలీతో కలిసి వెళ్లడం జరిగింది.

ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే రాజమౌళి సినిమా చేసే సమయంలో కూడా మహేష్ బాబు ఇలాగే విదేశీ యాత్ర లు చేస్తే ఎలా అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.రాజమౌళి తో సినిమా కు కమిట్ అయిన వారు కనీసం ఫ్యామిలీ ని కూడా పట్టించుకోకుండా మొత్తం షూటింగ్ కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది.అలా కాకుండా నాలుగు పడవల ప్రయాణం చేస్తానంటే మాత్రం రాజమౌళి ఒప్పుకోడు.
అందుకు మహేష్ బాబు సిద్ధంగా ఉన్నాడా? లేదంటే షూటింగ్ మొదలు అయిన తర్వాత ఈ విషయంలో ఏమైనా భేదాభిప్రాయాలు వస్తాయా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.







