మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం సుప్రీం హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) .వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంత సందడి చేస్తున్నటువంటి సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి( Road Accident) గురవడంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరమయ్యారు.
ఇలా కొంతకాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చినటువంటి తిరిగి విరూపాక్ష సినిమా ( Virupaksha Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ప్రమాదం తర్వాత నటించిన మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో సాయిధరమ్ తేజ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా విడుదలైనటువంటి మూడు నెలల వ్యవధిలోనే ఈయన నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) నటించిన బ్రో సినిమా( Bro Movie ) ఈనెల 28వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఈ సినిమా విడుదలైన అనంతరం తాను ఆరు నెలల పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నాను అంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించారు.ఈ విధంగా సాయిధరమ్ తేజ్ సినిమాలకు దూరం కావడానికి గల కారణమేంటి అనే విషయానికి వస్తే…

సాయి ధరంతేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆయనకు ఓ సర్జరీ చేయాల్సి ఉందట అయితే ఆ సర్జరీ ఇప్పటివరకు చేయలేదని ఆ సర్జరీ చేయించుకోవడం కోసమే తాను ఆరు నెలలపాటు సినిమాలకు దూరం అవ్వబోతున్నట్లు తెలిపారు.అయితే సాయి ధరమ్ తేజ్ ఈ సర్జరీ పూర్తయిన తర్వాత పూర్తిగా కోలుకొనే తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.ఇలా ఈయన సినిమాలకు ఆరు నెలలు బ్రేక్ ఇవ్వడంతోనే ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని అయితే తన స్నేహితులతో కలిసి నటించిన ఒక షార్ట్ ఫిలిం మాత్రం ఆగస్టు 15వ తేదీ విడుదల కాబోతుందని తెలిపారు.ఇలా ఇండస్ట్రీకి విరామం ఇవ్వబోతున్నానని సాయి ధరమ్ తేజ్ తెలియడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేసిన కానీ ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.







