ఇల్లు కట్టుకోవాలనే కల నెరవేర్చుకోండిలా.. తక్కువ వడ్డీకే ఈ బ్యాంకుల్లో రుణాలు

తమకంటూ సొంత ఇల్లు( Own House ) కట్టుకోవాలని అందరూ ఆశ పడతారు.దీని కోసం ఒక్కో రూపాయి పొదుపు చేసుకుంటూ డబ్బులు కూడబెట్టుకుంటారు.

 Banks Offering Lowest Home Loan Interest Rates,home Loans,home Loan Interestt Ra-TeluguStop.com

తమ కలల ఇంటిని నిర్మించుకుని మురిసిపోతారు.అయితే దాచుకున్న పొదుపుతో పాటు ఖచ్చితంగా ఇంటి నిర్మాణానికి మరికొంత సొమ్ము అవసరం ఏర్పడుతుంది.

ఈ సమయంలో చాలా మంది అధిక మొత్తంలో లోన్లు( Home Loans ) తీసుకుని అవి కట్టలేక ఇబ్బంది పడుతుంటారు.ముఖ్యంగా వడ్డీ ఎక్కువగా ఉండే లోన్లు తీసుకుని సమస్యలు కొని తెచ్చుకుంటారు.

అయితే ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి దేశంలోని పలు బ్యాంకులు గుడ్ న్యూస్ అందిస్తున్నాయి.గృహ రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నాయి.

Telugu Banks Loans, Hdfc, Loaninterestt, Loans, Indusind Bank, Rbi Repo-Latest N

5 బ్యాంకులు తమ గృహ రుణ రేట్లను( Home Loan Rates ) మార్చాయి.మార్కెట్ కంటే తక్కువ ధరలకు రుణాలను అందిస్తున్నాయి.రుణ ఆమోద ప్రక్రియకు ఛార్జీలు కూడా తక్కువగా ఉన్నాయి.చాలా బ్యాంకులు ఆర్‌బిఐ రెపో రేటుతో పాటు ఫ్లోటింగ్ రేటును ఉపయోగించాలని ఎంచుకున్నాయి.ప్రతి త్రైమాసికంలో ద్రవ్య విధాన సమావేశంలో ప్రకటించబడే ఆర్‌బిఐ రెపో రేటులో మార్పులతో రుణం తీసుకునే ఖర్చు మారుతుంది.ఆర్‌బీఐ రెపో రేటు( RBI Repo Rate )ను మార్చిన ప్రతిసారీ, రుణాలపై వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి.

గృహ రుణంపై వడ్డీ రేటు దరఖాస్తుదారు సిబిల్ స్కోర్, లోన్ మొత్తం, తిరిగి చెల్లించే వ్యవధి, ఆదాయం మొదలైన వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.హోమ్ లోన్ కాల వ్యవధి సాధారణంగా 3 నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుంది.

Telugu Banks Loans, Hdfc, Loaninterestt, Loans, Indusind Bank, Rbi Repo-Latest N

ఎందుకంటే, గృహ రుణం( Home Loan ) భారీ మొత్తం ఉంటుంది.తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందించే బ్యాంకులను పరిశీలిస్తే హెచ్‌డీఎఫ్‌సీ( HDFC ) మొదటి స్థానంలో ఉంది.హోమ్‌ లోన్స్‌ ఈ బ్యాంకులో వడ్డీ రేటు 8.45 శాతం నుంచి 9.85 శాతం వరకు ఉంటాయి.తర్వాత స్థానంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్( Indusind Bank ) ఉంది.ఈ బ్యాంకులో హోమ్ లోన్‌పై కనీస వడ్డీ రేటు 8.5 శాతం కాగా గరిష్ట వడ్డీ రేటు 9.75గా ఉంది.మూడో స్థానంలో ఉన్న ఇండియన్ బ్యాంక్( Indian Bank ) హోమ్ లోన్‌పై కనీస వడ్డీ రేటు 8.5 శాతం, గరిష్ట వడ్డీ రేటు 9.9 శాతం వసూలు చేస్తోంది.నాలుగో స్థానంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్‌పై కనీస వడ్డీ రేటు 8.6 శాతం ఉండగా, గరిష్ట వడ్డీ రేటు 9.45 శాతంగా ఉంది.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణం( Bank of Maharashtra Home Loans )పై కనీస వడ్డీ రేటు 8.6 శాతం ఉండగా, గరిష్ట వడ్డీ రేటు 10.3గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube