హాట్ స్టార్ లో ట్రెండింగ్ అవుతున్న రుద్రామాంబపురం చిత్రానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంశలు !!!

ఎన్‌వీఎల్ ( NVL )ఆర్ట్స్ ప‌తాకంపై నండూరి రాము( Nanduri Ramu ) నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం.మ‌హేష్ బంటు ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్.

 Minister Thalasani Srinivas Yadavs Praises For Rudramambapuram Movie Which Is T-TeluguStop.com

శుభోద‌యం సుబ్బారావు, అజయ్ ఘోష్( Ajay Ghosh ), అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.

సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన చిత్రం `రుద్ర‌మాంబ‌పురం`.మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌.

ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదలై మంచి స్పందన లభిస్తోంది.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Thalasani Srinivas Yadavs ) మాట్లాడుతూ…రుద్రమాంబపురం సినిమా మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు , ఆచారాలు, వారి కష్ట సుఖాల మీద వచ్చిన రుద్రమాంబపురం సినిమా బాగుంది.

చిత్ర యూనిట్ సభ్యులందరికి అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత నండూరి రాము మాట్లాడుతూ…మా రుద్రమాంబపురం( Rudramambapuram ) సినిమా డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది.

సినిమా చూసిన అందరూ బాగుంది అంటున్నారు, ప్రస్తుతం సినిమా హాట్ స్టార్ లో టాప్ పొజిషన్ లో ట్రేండింగ్ అవుతోంది.థియేటర్స్ లో రావాల్సిన సినిమా ఇదని అంటుంటే ఆనందంగా ఉంది.

నటులు అజయ్ ఘోష్, రాజశేఖర్ పోటీ పడి నటించారు.రుద్రమాంబపురం సినిమాకు రివ్యూ స్ కూడా బావున్నాయి.

త్వరలో మా NVL బ్యానర్ నుండి మరో సినిమాను అనౌన్స్ చెయ్యబోతున్నాము అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube