సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తెల్లగా అందంగా ఉండడంతో పాటు మంచి ఫిట్ నెస్( Heroines Fitness ) ను మెయింటైన్ చేస్తే సినిమా అవకాశాలు రావడం కూడా అంతంత మాత్రమే అని చెప్పవచ్చు.హీరోయిన్ ను కాస్త నలుపుగా చామంచాయ్ గా ఉన్నా కూడా ఈ అవకాశాలు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ లను నల్లగా ఉంది పొట్టిగా ఉంది అని ఇలా అనేక రకాల కారణాలతో రిజెక్ట్ చేశారు అన్న విషయం తెలిసిందే.ఈ విషయాలను చాలామంది హీరోయిన్లు బయటపెట్టారు.
కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ హీరోయిన్ మాత్రం తెల్లగా ఉంది అని రిజెక్ట్ చేశారట.

వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఇది నిజం.పూర్తి వివరాల్లోకి వెళితే.ఆ హీరోయిన్ మరెవరో కాదు.
హీరోయిన్ సెలీనా జైట్లీ( Heroine Celina Jaitley ). ఈమె 2001లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచింది ఈ భామ.అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో రన్నరప్‌గా కొద్దిలో కిరీటాన్ని మిస్ చేసుకుంది.ఇది జరిగి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఒక వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
మిస్ యూనివర్స్ పోటీ( Miss Universe )ల్లో పాల్గొన్న 103 మందిలో నేను కాస్త పొట్టిదాన్ని.అయినా సరే రన్నరప్‌గా నిలిచాను.ఇది నేను గర్వపడే విషయమే.15 ఏళ్ల వయసులోనే నేను ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను.చాలా స్ట్రగుల్స్ చూశాను.దానికి తోడు చదువు, పోటీ పరీక్షల ఒత్తిళ్లు ఉండేవి.

అలా నా టీనేజీ మొత్తం అంతా చాలా కష్టంగా గడిచింది.మొటిమలు, పొత్తి కడుపులో నొప్పి సమస్యలు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి.ప్రతినెలా పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా రక్తం పోయేది.నా వయసు వాళ్లందరూ అప్పట్లో వీకెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం కోల్‌కతాలో షూటింగ్స్, ర్యాంప్ షో( Ramp Show )లు చేస్తూ డబ్బులు సంపాదించుకునేదాన్ని.
కొన్నిసార్లు నన్ను చాలా కష్టపెట్టేవారు.అనుమతి లేకుండా నా ఫొటోలు వాడేసుకునేవాళ్లు.చివరకు డబ్బులు సరిగా ఇచ్చేవారు కాదు.మరీ తెల్లగా, సన్నగా ఉన్నానని చెప్పి చాలాసార్లు రిజెక్ట్ చేశారు.
అదే అందరిలో నన్ను స్పెషల్‌గా మార్చింది.అందం అనేది శక్తివంతమైన ఆయుధం.
నా దేశం తరఫున ఓ యాక్టర్, అంబాసిడర్‌గా పాల్గొన్నందుకు చాలా గర్వపడుతున్నాను అని చెప్పుకొచ్చింది సెలీనా జైట్లీ.







