మహేష్ బాబు ( mahesh babu )కూతురు సితార( Sitara ) తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయం పెంచుకున్న సంగతి తెలిసిందే.ఒకవైపు సోషల్ మీడియాలో.
మరోవైపు బుల్లితెర షోలల్లో కనిపిస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.చిన్నప్పటినుండి తండ్రి మహేష్ బాబు, తల్లి నమ్రత ( Namrata Shirodkar )తనకు మంచి స్వేచ్ఛను ఇచ్చారు.
అలా చిన్నప్పటినుండి తను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంఫాలోయింగ్సపాదించుకుంది.అంతేకాకుండా తన తండ్రి నుండి ఎంతో అభిమానం సొంతం చేసుకుంది.
అతి చిన్న వయసులోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సీతార తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ తన వైపు మలుపుకుంది.సోషల్ మీడియాలలో తన ఫ్యామిలీ గురించి కూడా చాలా విషయాలు పంచుకుంటూ ఉంటుంది.
తన సోదరుడితో కలిసి బాగా ఆడుకుంటున్న వీడియోలను కూడా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన తండ్రితో సినిమా సెట్ కు వెళ్లి అక్కడ జరిగిన విషయాలుకూడా పంచుకుంటుంది.

ప్రతి రోజు ఏదో ఒక పోస్టు తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది సితార.పైగా ఆ మధ్య వెండితెరపై కూడా అడుగుపెట్టింది.తన తండ్రి నటించిన సర్కారు వారి పాటలో ఒక పాటకు స్టెప్పులు కూడా వేసింది.ఫ్యామిలీతో కలిసి విదేశాలలో తిరిగినప్పుడు కూడా బాగా ఫోటోలు దిగుతూ పంచుకుంటుంది.
సితార సోషల్ మీడియాకు ఎంత యాక్టివ్ గా ఉంటుందో గౌతమ్ సోషల్ మీడియాకు అంత దూరంగా ఉంటాడు.
ఇక సితార ఎనర్జీ చూసి చాలామంది త్వరలో సితార హీరోయిన్ అవ్వటం ఖాయమని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు.
కేవలం క్లాసికల్ డాన్స్ లే వెస్టర్డ్ డాన్స్ లు కూడా చేస్తూ ఉంటుంది.రీసెంట్ గా లంగా వోని ధరించి ఒక డాన్స్ చేయగా అందులో తన స్టెప్ లతో మరోసారి తన ఫాలోవర్స్ ఫిదా చేసింది.
ఇక ట్రెడిషనల్ లుక్ లోనే కాకుండా అప్పుడప్పుడు గ్లామర్ లుక్కులో కూడా కనిపిస్తూ ఉంటుంది.

ఆమె గ్లామర్ లుక్ లో కనిపిస్తే చాలు మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఫైర్ అవుతూ ఉంటారు.అయితే ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సితార ఒక జ్యువెలరీ యాడ్లో నటించగా అది న్యూయార్క్ లోని ఒక షాపింగ్ మాల్ లో వేశారు.ఇక అందులో సితార హీరోయిన్లను మించి అందంగా కనిపించింది.
మొన్నటివరకు చిన్న అమ్మాయిగా కనిపించిన సీతార ఆ గ్యాలరీలలో చాలా పెద్ద అమ్మాయిగా కనిపించడంతో ఇక సితార హీరోయిన్ అవ్వటం ఫిక్స్ అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.అయితే తొలిసారిగా సితార అలా కనిపించడం తన తల్లిదండ్రులకు కూడా చాలా సంతోషం వేసిందని చెప్పాలి.
అంతేకాకుండా ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.అయితే ఈ యాడ్ కోసం సితార ఏకంగా కోటి రూపాయల పారితోషకం తీసుకుందని తెలిసింది.
దీంతో ఆమె అంత పారిశేషకం తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఆ వయసులో మేము వంద రూపాయలు సంపాదించడమే గ్రేట్.
అటువంటిది నువ్వు కోటి రూపాయలు సంపాదించాలంటే మామూలు విషయం కాదు అని పొగుడుతున్నారు.







