ప్రస్తుతం చదువుకునే విద్యార్థులంతా ట్యాబ్ లను వినియోగిస్తున్న క్రమంలో మార్కెట్లో ట్యాబ్ల అధిక మొత్తంలో సేల్ అవుతున్నాయి.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పలు కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో ట్యాబ్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు.
కరోనా అనంతరం ట్యాబ్ల వినియోగం అధికంగా ఉందని గుర్తించిన లెనోవో కంపెనీ( Lenovo Company ) తన కొత్త ట్యాబ్ ను భారత దేశ మార్కెట్లోకి లాంచ్ చేసింది.ఈ కొత్త ట్యాబ్ కు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలు ఏమిటో చూద్దాం.
లెనోవా కంపెనీకి చెందిన ఈ ట్యాబ్ లెనోవో ఎం10 5G( Lenovo Tab M10 5G ) తో మార్కెట్లోకి విడుదల అయింది.ఈ ట్యాబ్ 10.61 అంగుళాల LCD డిస్ ప్లే ను కలిగి ఉంది.టీయూవీ ఐ కేర్ సర్టిఫైడ్ ప్యానల్ ఉంటుంది.ఇది బ్లూ లైట్ ని ఫిల్టర్ చేస్తుంది.400 నిట్స్ పిక్ బ్రైట్ నేస్ ను కలిగిఉంది.ఈ ట్యాబ్ లో స్నాప్ డాగ్ 695 చిప్ సెట్ ఉంటుంది.7700 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.ఒకసారి చార్జింగ్ పెడితే 12 గంటల పాటు వీడియోలు చూడవచ్చు.
ఫోటోల కోసం ముందు వైపు 8 ఎంపీ కెమెరా, వెనుక వైపు 11 ఎంపీ కెమెరా ఉంటుంది.ఇందులో ఫేషియల్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ కూడా అమర్చబడి ఉంది.డివైస్ ను వేగంగా అన్లాక్ చేయడానికి ఉపకరిస్తుంది.
కాదు రీడింగ్ మోడ్ నుంచి చదివే అనుభవాన్ని కూడా ఇస్తుంది.లెనోవో ట్యాబ్ 4GB RAM + 128GB స్టోరేజ్, 6GB RAM+ 128GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.I ట్యాబ్ ప్రారంభ ధర రూ.24999 తో ఉంది.అయితే ఈ ట్యాబ్ లపై అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు లాంచింగ్ ఆఫర్లు కూడా అందిస్తున్నాయి.లెనోవో అధికారిక వెబ్సైట్లో కూడా కొనుగోలు చేయవచ్చు.