సౌదీ అరేబియా( Saudi Arabia ) మాజీ న్యాయశాఖ మంత్రి, ముస్లిం వరల్డ్ లీగ్ అధ్యక్షుడు మహ్మద్ బీన్ అబ్ధుల్ కరీం ఆల్ ఇస్సా( Muhammad bin Abdul Karim Al-Issa ) గత కొద్దిరోజులుగా ఇండియాలో పర్యటిస్తున్నారు.ఆరు రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటించనున్నారు.
ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు.
జులైలో 10 నుంచి ఆయన ఢిల్లీలో పర్యటిస్తుండగా.ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలువరు మత పెద్దలు, పౌర సమాజ సభ్యులను కలిశారు.
ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు.

అయితే తాజాగా ఒక మసీదులో జరిగిన సామూహిక ప్రార్థనల్లో ఆల్ ఇస్సా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇస్లాం, ముస్లింల బాధ్యతల గురించి మాట్లాడారు.ఇస్లాంలో తీవ్రవాదానికి ( Terrorism ) తావు లేదని, హింసామార్గంలో నడిచేవారిని ఓడిస్తామని పిలుపునిచ్చారు.
హింసా మార్గంలో నడిచేవారికి ఇస్లాంలో స్థానం లేదని వ్యాఖ్యానించారు.ముస్లింలు ఎక్కడ ఉన్నా అక్కడి చట్టాలు, సంస్కృతిని ఆచరించాలని తెలిపారు.
ముస్లింలు( Muslims ) అందరిపట్ల దయతో ఉండాలని, సరైన మార్గంలో నడవాలని సూచించారు.ఇరుగుపోరుగు వారిని గౌరవించాలని ఆయన తన ప్రసంగంలో తెలిపారు.

ఇస్లాం ఒక కఠినమైన మత విస్వాసం కాదని, భిన్నత్వం, ఇతర మతాలను గౌరవించాలని చెప్పారు.అయితే బుధవారం ఇస్సా అక్షరధామ్ దేవాలయాన్ని( Akshardham ) సందర్శించారు.ఆ తర్వాత పలువురు ఆధ్యాత్మిక వేత్తలను కలివారు.అయితే డాక్టర్ అల్ ఇస్సా సౌదీ అరేబియాలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో సౌదీ అరేబియాలోని కఠిన చట్టాలను మహిళలు, కుటుంబాలకు అనుకూలంగా మార్చారు.
ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది.మంత్రిగా ఉన్న సమయంలో పలు కీలక సంస్కరణలు ప్రవేశపెట్టారు.ఇండియాలో పర్యటిస్తున్న ఆయనను పలు ముస్లిం సంఘాలు కలిశాయి.పలు విషయాలను ఆయనతో చర్చించాయి.







