రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు( Guntapalli pond ) తండా గ్రామపంచాయితీ కి చెందిన గుగులోత్ మౌనిక కు 16 వేల రూపాయలు, మాలోత్ జోహార్ ( Malot Zohar )కు 38 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎంపీపీ పిళ్లి రేణుక కిషన్ , జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , సర్పంచ్ మాలోత్ సునీత పుణ్యానాయక్ బిఆర్ ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గణేష్ లు కలిసి శనివారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, మాజీ ఎఎంసి చైర్మన్ అందె సుభాష్, గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు గణేష్, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







