టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఒకరు.ఈయన ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
తాజాగా ఎఫ్ త్రీ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం బాలకృష్ణ( Balakrishna )తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా భగవంత్ కేసరి( Bhagavanth Kesari ).ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఏ హీరోతో సినిమా చేయబోతున్నారన్న విషయం గురించి పెద్ద ఎత్తున సందేహాలు తలెత్తాయి.

ఇకపోతే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి మరొక స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది.గతంలో అనిల్ రావిపూడి ఓ సందర్భంలో మాట్లాడుతూ తనకు నాగార్జున ( Nagarjuna )చిరంజీవి( Chiranjeevi ) గారితో సినిమా చేయాలని ఉంది అంటూ కామెంట్ చేశారు.ఈ క్రమంలోనే ఈయన చిరంజీవి గారితో ఓ సినిమా చేయబోతున్నారు అంటూ వార్త వైరల్ గా మారింది.ఇక చిరంజీవి కూడా అనిల్ రావిపూడితో సినిమా చేయాలని గతంలో వెల్లడించారు.
ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని ఇదే కనుక నిజమైతే వచ్చే ఏడాది అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు సీక్వెల్ చేయాలన్న కోరిక ఉందని తెలిపారు.బహుశా ఇలాంటి కథతోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందేమోనని పలువురు భావిస్తున్నారు.ఇప్పటికే వెంకటేష్ బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమా చేసినటువంటి అనిల్ రావిపూడి త్వరలోనే చిరంజీవితో చేయబోతున్నారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
చిరంజీవి తాజాగా నటించిన భోళా శంకర్( Bhola Shankar ) సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమా తర్వాత ఈయన కళ్యాణ్ కృష్ణ ( Kalyan Krishna )దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని సమాచారం.







