హెయిర్ ఫాల్( Hair fall, ).కోట్లాది మందిని పట్టిపీడిస్తున్న కామన్ సమస్య ఇది.
అందరిలోనూ హెయిర్ ఫాల్ కు కారణం ఒకేలా ఉండదు.ఒక్కొక్కరిలో ఒక్కొక్క కారణం చేత జుట్టు ఊడిపోతుంటుంది.
జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు తోచిన ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.ఖరీదైన షాంపూ వాడుతుంటారు.
అయినా సరే జుట్టు రాలడం ఆగకపోతే ఏం చేయాలో తెలియక తీవ్రంగా సతమతం అవుతుంటారు.అయితే చింతే వద్దు.
ఇప్పుడు చెప్పబోయే మూడు ఉంటే చాలు.రాలిపోయిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మూడు ఏంటి.వాటితో జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవచ్చు అన్నది తెలుసుకుందాం పదండి.
![Telugu Oil, Flax Seeds, Care, Care Tips, Fall, Long, Thick-Telugu Health Telugu Oil, Flax Seeds, Care, Care Tips, Fall, Long, Thick-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2023/07/hair-care-tips-long-hair-thick-hair-.jpg)
అవిసె గింజలు, ఉల్లిపాయ, ఆముదం( Castor Oil )కేవలం ఈ మూడు పదార్థాలతో హెయిర్ ఫాల్ సమస్యను ఈజీగా దూరం చేసుకోవచ్చు.అందుకోసం ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ( Onion ) ని తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ నుంచి ఉల్లి జ్యూస్ ను సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి.జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు పల్చటి వస్త్రం సహాయంతో అవిసె గింజల జెల్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఈ జెల్ లో ఉల్లి జ్యూస్ మరియు రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
![Telugu Oil, Flax Seeds, Care, Care Tips, Fall, Long, Thick-Telugu Health Telugu Oil, Flax Seeds, Care, Care Tips, Fall, Long, Thick-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2023/07/long-hair-thick-hair-castor-oil-onion-flax-seeds.jpg)
ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.అలాగే పల్చగా ఉన్న జుట్టు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా పొడుగ్గా మారుతుంది.
మరియు కురులు సిల్కీగా షైనీ గా మెరుస్తాయి.కాబట్టి జుట్టు విపరీతంగా ఊడిపోతుందని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.