BVS Ravi Baby Movie: బేబీ మూవీపై అలాంటి ట్వీట్ చేసిన బీవీఎస్ రవి.. ఇడియట్స్ దురదృష్టవంతులు అంటూ?

ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం బేబీ.( Baby Movie ) ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.

 Bvs Ravi On Skn And Sai Rajesh Baby Movie Team-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.ముఖ్యంగా సినిమాలోని కొన్ని డైలాగులు బాగోలేవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి( BVS Ravi ) స్పందిస్తూ ఒక ట్వీట్ వేశాడు.బీవీఎస్ రవి తాజాగా బేబీ గురించి మాట్లాడాడు.

ఈ రోజు అంతా కూడా సోషల్ మీడియాలో బేబీ సినిమా మేనియా నడుస్తోంది.

Telugu Baby, Bvs Ravi Baby, Bvsravi, Sai Rajesh, Tollyood, Viraj Ashwin-Movie

అయితే ఇప్పుడు బేబీ సినిమా మీద కాస్త ట్రోలింగ్ కూడా జరుగుతోంది.నెగెటివ్ కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి.కానీ బేబీ మూవీని ఇప్పట్లో ఆపడం మాత్రం కష్టమే అని చెప్పవచ్చు.

బేబీ సినిమా యూత్‌కు బాగానే నచ్చేసింది.స్కూల్, ఇంటర్, బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్, మరి ముఖ్యంగా ప్రేమికులు ఈ సినిమాకు ఇట్టే కనెక్ట్ అవుతున్నారు.

ఇందులో వైష్ణవిని( Vaishnavi Chaitanya ) కాస్త నెగెటివ్‌గా చూపించడం, రియలిస్టిక్‌గా సినిమాను తీయడంతో జనాలు మరింతగా అట్రాక్ట్ అవుతున్నారు.ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు.

అయితే ఈ సినిమా సాధించబోతోన్న నంబర్లు, విజయం గురించి బీవీఎస్ రవి ఒక కామెంట్ వేశాడు.

Telugu Baby, Bvs Ravi Baby, Bvsravi, Sai Rajesh, Tollyood, Viraj Ashwin-Movie

వీళ్లు నిజంగానే ఇడియట్సా? లేదా దురదృష్టవంతులో తెలియడం లేదు.ఈ సినిమాను సమ్మర్‌లో( Summer ) రిలీజ్ చేసి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది అంటూ బేబీని పొగిడేశాడు బీవీఎస్ రవి.అయితే మొత్తానికి బేబీ మాత్రం ఇప్పుడు యువతకు బాగానే నచ్చుతుంది.ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా బేబీని మల్చడంతో నిర్మాత ఎస్ కేఎన్, దర్శకుడు సాయి రాజేష్ విజయం సాధించారు.ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) నటన, వైష్ణవి చైతన్య పాత్రను మలిచిన తీరు, విరాజ్ అశ్విన్ యాక్టింగ్, సాయి రాజేష్ రైటింగ్, హార్ట్ టచ్చింగ్ డైలాగ్స్ విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం, పాటలు, ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా సినిమాను నిలబెట్టేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube