టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే అతికొద్ది మంది హీరోలలో సాయితేజ్( Saitej ) ఒకరు.విరూపాక్ష సినిమాతో ఈ ఏడాది కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న సాయితేజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకుంటానని నమ్ముతున్నారు.
త్వరలో బ్రో సినిమా( Bro Movie ) రిలీజ్ కానున్న నేపథ్యంలో శ్రీ కాళహస్తికి( Sri Kalahasthi ) వెళ్లిన సాయితేజ్ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా వార్తల్లో నిలిచారు.
ప్రత్యేక పూజలు చేసిన సాయితేజ్ ఒక చిన్న తప్పు చేయడం వల్ల వివాదంలో చిక్కుకున్నారు.
శ్రీకాళహస్తిలో అర్చకులు సాయితేజ్ చేతుల మీదుగా హారతి( Harathi ) ఇప్పించడం గమనార్హం.వాస్తవానికి శ్రీకాళహస్తిలో అర్చకుడు మినహా ఇతరులు ఎవరైనా హారతి ఇవ్వడం నిషేధం కాగా సాయితేజ్ మెగా హీరో కావడంతో అక్కడి అర్చకులు ఈ నిబంధనలను తుంగలో తొక్కి అత్యుత్సాహం ప్రదర్శించడం గమనార్హం.

ఉపాలయంలో చంగల్ రాయ స్వామిని దర్శించుకోవడానికి సాయితేజ్ వెళ్లగా సిబ్బంది సాయితేజ్ చేతులకు హారతి అందించారు.సామాన్య జనం హారతి ఇవ్వడం నిషిద్ధం అయినా ఈ విధంగా ఎలా చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గతంలో సింగర్ మంగ్లీ ( Singer Mangli ) ఆలయంలో పాటను షూట్ చేయడంపై కూడా విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకొని వెళ్లడానికి కూడా అనుమతి లేదు.

శ్రీకాళహస్తి ఆలయ అధికారులు ఈ వివాదాల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ఏ ఆలయం విషయంలో జరగని పొరపాట్లు ఈ ఆలయం విషయంలోనే జరుగుతుండటం గమనార్హం.సామాన్య భక్తుల నుంచి శ్రీకాళహస్తి ఆలయ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఏపీ ప్రభుత్వం సైతం శ్రీకాళహస్తిలో జరుగుతున్న ఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.
శ్రీకాళహస్తిలో ఇకనైనా ఈ తరహా వివాదాలు జరగకుండా ఉంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







