పక్షులు, మూగజీవాల కోసం పంట సాగు చేస్తున్న రైతు.. ఇతని గొప్పదనం తెలిస్తే గ్రేట్ అనాల్సిందే!

ప్రస్తుత కాలంలో చాలామంది స్వార్థంతో జీవనం సాగిస్తున్నారు.ఏ పని చేసినా తమకు లాభం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 Palnadu Komera Ankarao Saves Forest Inspirational Journey Details Here Goes Vir-TeluguStop.com

ప్రకృతికి మేలు చేయడం కోసం ఆలోచించేవాళ్లే కరువయ్యారు.అయితే ఒక వ్యక్తి మాత్రం తన కుటుంబం కంటే ప్రకృతికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఆ వ్యక్తి గొప్పదనం గురించి పక్షులు( Birds ), మూగజీవాల కోసం పంట సాగు చేస్తూ మంచితనాన్ని చాటుకోవడం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

గడిచిన పాతిక సంవత్సరాలుగా నల్లమల అడవుల్లో ప్లాస్టిక్( Plastic ) ను ఏరివేస్తూ, అడవిని రక్షిస్తూ మూగ జీవాలకు ఆహారం అందేలా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు కొమెర అంకారావు ఉరఫ్ జాబి.

నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, మందు సీసాలను శుభ్రం చేయడమే జాజి దినచర్యగా మార్చుకున్నారు.భుజాన గోనె సంచి పట్టుకుని చెత్తను తొలగిస్తూ పర్యావరణ పరిరక్షకుడిగా జాజి మంచి పేరును సొంతం చేసుకున్నారు.

Telugu Forest, Inspirational, Jazzy, Komera Ankarao, Madras Private, Palnadukome

డిగ్రీ వరకు చదువుకున్న జాజి ప్రకృతి పాఠశాల( Jazzy ) పేరుతో బుక్ కూడా రాశారు.తొలకరి వచ్చిన సమయంలో అడవిలోని ఎత్తైన ప్రాంతాలలో విత్తనాలు చల్లి అటవీ వృక్ష సంపద పెరగడానికి జాజి తన వంతు కష్టపడుతున్నాడు.ప్లాస్టిక్ తినడం వల్ల వన్య ప్రాణులు చనిపోతున్న నేపథ్యంలో జాజి ఈ నిర్ణయం తీసుకున్నారు.తనకున్న 80 సెంట్ల పొలంలో పక్షుల మేత కొరకు సజ్జ, జొన్న పంటలు వేసి సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారు.

Telugu Forest, Inspirational, Jazzy, Komera Ankarao, Madras Private, Palnadukome

అడవిలో ఉండే ప్రతి మొక్క, ఆకు గొప్పదనం జాజికి తెలుసు.ఆయుర్వేద పరిశోధకులకు అవసరమైన మొక్కలను సైతం అందిస్తూ జాజి తన మంచి మనస్సును చాటుకుంటున్నారు.జాజి కృషికి మెచ్చి మద్రాస్ ప్రైవేట్ వర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది.యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయంతో జాజి కెరీర్ ను కొనసాగిస్తున్నారు.అడవి తల్లి చల్లగా ఉంటే సమస్త జీవజాలానికి మనుగడ ఉంటుందని ఆయన చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube