భారతీయ విద్యార్థులు( Indian Students ) చదువు కోసం లేదా ఉద్యోగం కోసం వేరే వేరే దేశాలకు వెళుతూ ఉంటారు.వేరే దేశాల్లో అత్యుత్తమ విద్య, అత్యధిక జీతాలు ఉంటాయనే ఉద్దేశంతో అక్కడికి వెళుతుంటారు.
అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు ఇండియన్స్ ఎక్కువమంది వెళుతూ ఉంటారు.అయితే ఆ దేశాలకు వెళ్లాలంటేనే వీసా అససరం ఉంటుంది.
వీసా( Visa ) కోసం విద్యార్థులు, ఉద్యోగులు తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే తాజాగా బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్( PM Rishi Sunak ) చేదువార్త తెలిపారు.
యూకే వచ్చేవారినుంచి వీసా ఛార్జీలు భారీగా వసూలు చేయాలని నిర్ణయించారు.

వీసాకు సంబంధించిన వైద్యు ఖర్చులను పెంచనున్నట్లు రిషి సునక్ తాజాగా స్వయంగా వెల్లడించారు.వీసాదారులు చెల్లించే హెల్త్ సర్ ఛార్జిని( Health Surcharge ) భారీగా పెంచనున్నట్లు తెలిపారు.యూకేలో( UK ) ప్రభుత్వ వైద్యులతో పాటు టీచర్లు, పోలీసులు, జూనియర్ డాక్టర్లకు భారీగా జాతాలు పెంచాలని రిషి సునక్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచాలని ఒక స్వతంత్ర కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.ఆ రిపోర్ట్ ప్రకారం ఉద్యోగులకు జీతాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దాదాపు ప్రభుత్వ ఉద్యోగులకు 5 నుంచి 7 శాతం మేరకు జీతాలు పెంచాలని రిషి సునక్ నిర్ణయించారు.దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడనుంది.ఈ లోటును భర్తీ చేసేందుకు వీసాదారుల నుంచి భారీ మొత్తంలో హెల్త్ సర్ ఛార్జీ వసూలు చేయనున్నారు.ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చుల కోసం అప్పులు చేసి నిధులు సమీకరించబోమని, భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి చర్యలకు పూనుకోమని తెలిపారు.
అందుకే వీసా ఛార్జీలను భారీగా పెంచడం ద్వారా వచ్చే నిధులను ఉపయోగించుకోనున్నారు.దీంతో ఇక నుంచి యూకే వీసా( UK Visa ) పొందాలంటే అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంది.







