మనలో కొంతమంది వివిధ మార్గాల్లో ఆదాయం ఆర్జిస్తూ వుంటారు.కొంతమంది స్వదేశంలో సంపాదిస్తే, మరికొందరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ దండిగా సంపాదిస్తూ వుంటారు.
ఇంకా ఇక్కడ కొంత కాలం పని చేసి, మంచి ఆఫర్ వచ్చి విదేశాలకు వెళ్లే వాళ్లు కూడా వుంటారు.ఇప్పుడు అలాంటి వాళ్లు ఇన్కమ్ ట్యాక్స్( Income Tax ) కట్టాలా, వద్దా? ఒకవేళ చెల్లించాల్సి వస్తే ఎలా చెల్లించాలి, ఏయే అంశాలను, దృష్టిలో పెట్టుకోవాలి? ఏయే రూపాలలో చెల్లించాలి? అనే అనుమానాలు అలాంటివాళ్లకు కలగడం పరిపాటే.ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో 182 రోజులు భారతదేశంలో ఉన్నట్లయితే, అతన్ని రెసిడెంట్ గా పరిగణిస్తారు.భారతీయ నివాసి సంపాదించే గ్లోబల్ ఇన్కమ్, భారతదేశ ఇన్కమ్ టాక్స్ యాక్ట్ పరిధిలోకి వస్తుందనే విషయం అర్ధం చేసుకోవాలి.
ఆ వ్యక్తికి భారతదేశంలో ఉద్యోగం చేస్తున్న తరహాలోనే టాక్స్ రేట్లు వర్తిస్తాయి.
ఇక విదేశాల్లో అందుతున్న జీతాన్ని ‘ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ’( Income From Salary ) హెడ్లో చూపించాలి.విదేశీ కరెన్సీలో వచ్చే జీతాన్ని రూపాయిల్లోకి మార్చి చూపాల్సి ఉంటుంది.అదేవిధంగా మీరు పని చేస్తున్న కంపెనీ వివరాలు ఇవ్వాలి.
జీతంపై ముందస్తు టాక్స్ కట్ అయితే, దానిని ఐటీ రిటర్న్లో చూపి, రిఫండ్ కోసం క్లెయిమ్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తారు.డిటిఏఏ (డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్) బెనిఫిట్ ద్వారా రెండు దేశాల్లోనూ పన్ను కట్టాల్సిన ఇబ్బంది నుంచి ఇపుడు తప్పించుకోవచ్చు.
మీరు పని చేస్తున్న దేశంతో డిటిఏఏ లేకపోతే, సెక్షన్ 91 ప్రకారం ఉపశమనం పొందవచ్చు.మన దేశంలో డిడక్షన్ లేదా ఎగ్జమ్షన్ వంటివి మీకు వర్తిస్తే, వాటిని ఉపయోగించుకోవచ్చు.
సెక్షన్ 80C లేదా 80D కింద పెట్టిన పెట్టుబడులకు పన్ను మినహాయింపు తీసుకోవచ్చు.
విదేశాల్లోని సంపాదిస్తే, మీ ఆదాయ పన్ను పత్రాల్లో FA (ఫారిన్ అసెట్స్)( Foreign Assets ) గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.మీరు ఒకవేళ సమాచారం దాచారని బయట పడితే ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది.ఈ క్రమంలోనే విదేశాల్లో సంపాదన గురించి, ఆదాయ పన్ను విభాగం, టాక్స్ పేయర్లను మరోమారు అలెర్ట్ చేసింది.
దేశం వెలుపల బ్యాంక్ ఖాతా, ఆదాయం వంటివి ఉంటే… 2023-24 అసెస్మెంట్ ఇయర్ టాక్స్ రిటర్న్( IT Returns ) ఫైల్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఫారిన్ అసెట్స్ షెడ్యూల్ పూరించాలంటూ తాజాగా ట్వీట్ చేసింది.ఒకవేళ, విదేశీ సంపాదనల గురించి టాక్స్ పేయర్ వెల్లడించకపోతే, ఆదాయ పన్ను విభాగం అతనిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు.బ్లాక్ మనీ (వెల్లడించని విదేశీ ఆదాయం ఆస్తులు) టాక్స్ యాక్ట్ 2015 కింద రూ.10 లక్షల జరిమానా విధించవచ్చు.కాగా ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడానికి తుది గడువు 31 జులై 2023 అని అందరూ గుర్తించుకోండి.