Kamal Haasan : ఆదిత్య 369లోని ఆ పాత్ర మొదటగా కమల్ హాసన్ దగ్గరికి వెళ్లిందట, కానీ చేయనన్నారట?

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna )నటించిన ఆదిత్య 369 సినిమాని తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోరు.ఈ సినిమా రిలీజై మూడు దశాబ్దాలకు పైనే అవుతున్నా టీవీలలో ఈ సినిమా వచ్చిందంటే జనాలు ఇప్పటికీ అతుక్కుపోయి మరీ ఆ సినిమాని చూస్తూ ఉండిపోతారు.

 Kamal Haasan Rejected To Work In Adithya 369-TeluguStop.com

కాలంతో పాటుగా ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ దానికి సమకాలీన అంశాలను జోడించి ఓ కధని తెరకెక్కించేవారే దర్శకులు.పైగా దానికి సైన్స్ ఫిక్షన్ ని జోడిస్తూ అత్యద్భుతంగా సినిమా తీశారు సింగీతం శ్రీనివాసరావు.

Telugu Adithya, Kamal Haasan, Srinivasa Rao, Tollywood-Movie

ఆదిత్య 369 సినిమా కథ ఒకరోజు ఎస్పీ బాలసుబ్రమణ్యం,( S.P.Balasubrahmanyam ) సింగీతం శ్రీనివాసరావు విమాన ప్రయాణం చేస్తున్న సందర్భంలో సింగీతం గారు టైం మిషన్ కథని మన బాలు గారికి చెప్పారట.దానికి ఆయన చాలా పాజిటివ్ గా స్పందించారట.

అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎస్పీ బాలు నిర్మాత శివ లింగ కృష్ణ ప్రసాద్ కి టైమ్ మిషన్ కథ గురించి చెప్పడంతో ఆ ఇద్దరూ తిరిగి సింగీతం గారిని కలవడానికి వెళ్లారట.అలా కథ డెవలపింగ్ విషయంలో టైమ్ మిషన్ గతంలోకి వెళ్లడం జరుగుతుంది.

అయితే అప్పుడు ఏ వంశ కాలపు రాజుల కథను మరలా తీసుకోవాలని కసరత్తులు చేశారట సింగీతం శ్రీనివాసరావు.ఈ విషయమై జంధ్యాల గారిని కలవడంతో అప్పుడు జంధ్యాల గారు బాలకృష్ణ గారికి శ్రీకృష్ణదేవరాయలు గెటప్పు బాగా నప్పుతుందని, ఆ కాలాన్ని ఎంచుకుంటే బావుంటుందని చెప్పడంతో జంధ్యాలగారు ఈ సినిమాకి అలా సంభాషణలు రాశారట.

Telugu Adithya, Kamal Haasan, Srinivasa Rao, Tollywood-Movie

ఈ సినిమాకి మొదటగా పీసీ.శ్రీరామ్ వర్తమానంలో వచ్చే దృశ్యాలను తెరకెక్కించారట.ఆ తర్వాత అనారోగ్య పరిస్థితుల వలన ఆయన తప్పుకోవడంతో వి.ఎస్.ఆర్ స్వామిని కెమెరామెన్ గా తీసుకొని సినిమాలోని శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దృశ్యాలను తీశారట.అప్పటికి ఆయన డేట్స్ అయిపోవడంతో కబీర్ లాల్ అనే మరొక కెమెరామెన్ ని తీసుకొని సినిమాలోని భవిష్యత్తులో వచ్చ దృశ్యాలను చిత్రీకరించడం జరిగిందట.

అలా ఈ సినిమాలో ముగ్గురు కెమెరామెన్ లు వర్క్ చేయడం నిజంగా రికార్డ్ అని చెబుతూ వుంటారు.ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమాలో డేట్స్ ఇబ్బంది ఉండకూడదని ప్రొఫెసర్ గా టిను ఆనంద్, విలన్ గా అమ్రిష్ పురి, తెనాలి రామకృష్ణుడి గా చంద్రమోహన్ లు నటించగా సినిమాలో ప్రధానమైన కృష్ణకుమార్ పాత్ర కోసం కమలహాసన్ ని చేయమని అడిగారట.

ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఎస్పీ బాలు సూచన మేరకు బాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయలు, కృష్ణ కుమార్ గా ద్విపాత్రాభినయం చేయడం జరిగింది.ఇక ఈ సినిమా రిలీజైన తరువాత ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube