సాధారణంగా మన శరీరం వేడి వాతావరణంలో చెమట వలన దుర్వాసనకు గురవుతుంది.సువాసనలే కాకుండా దుర్వాసనలు కూడా రకరకాలుగా ఉంటాయి.
ఎక్కువ దుర్వాసన అనారోగ్యాన్ని సూచిస్తుంది.అయితే ఆ సంకేతాన్ని అర్థం చేసుకోగలిగితే ఇది హెచ్చరిక లాగా కూడా పనిచేస్తుంది.
అరచేతులు, చంకలు, వ్యక్తిగత భాగాలు, పాదాలు శరీరంలో దుర్వాసన కార్ఖానాలు అనేకం.అయితే మనం తినే ఆహారాన్ని బట్టి, మనల్ని పీడిస్తున్న ఆరోగ్య సమస్యలను బట్టి, మనం వాడే మందులని బట్టి కూడా వాసన మారిపోతుంది.
అయితే లైంగిక వ్యాధులు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్( Urinary tract infection ) తదితర రుగ్మతలు ఉన్న వారి దగ్గర మూత్రాన్ని గుర్తుకు తెచ్చే దుర్వాసన ఉంటుంది.
అంతేకాకుండా మరికొందరి దగ్గర నుండి పులిసిన పండ్లను గుర్తుతెచ్చేలాంటి దుర్వాసన వస్తూ ఉంటుంది.అయితే ఇది మధుమేహం ఉన్నవారిలో కనిపిస్తుంది.ఇక ఎసిడిటీ ( Acidity )తో బాధపడుతున్న వారు నోరు తెరిస్తే చాలు ఒక చెత్త కుప్ప పక్కన నిలబడినట్టు దుర్వాసన వస్తుంది.
ఇక కొందరికి ముక్కు లో నుంచి కూడా దుర్వాసన వస్తుంది.అయితే నాసికంలోని నాళాలలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఈ విధంగా ముక్కులో నుంచి దుర్వాసన వస్తుంది.
చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు కూడా అటువైపు నుంచి దుర్వాసన వస్తుంది.ఫంగస్ దాడికి గురైనప్పుడు కూడా పాదాల నుండి దుర్వాసన వస్తుంది.
ఇక మలమూత్రాలు కూడా ఒక పరిమితికి నుంచి దుర్వాసనను వెదజల్లుతున్నాయి అంటే తేలికగా తీసుకోవడం మంచిది కాదు.ఎందుకంటే మల ముత్రాలలో పరిమితికి మించి దుర్వాసన వస్తుందంటే కచ్చితంగా మీ శరీరం ఇన్ఫెక్షన్( Body infection) కి గురైందని చెప్పవచ్చు.అందుకే తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.అయితే చాలామంది ఈ దుర్వాసనలను పౌడర్లతో, అత్తరులతో కప్పి పెట్టాలని చూస్తారు.ఇలా చేయడం వలన ఎంతవరకు దుర్వాసన తగ్గుతుందనే విషయాన్ని గ్రహించాలి.అందుకే కప్పి ఉంచడం కన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.