బ్రో విషయంలో వైసీపీ సైలెన్స్.. పవన్ సినిమాకు షాకివ్వబోయేది వాళ్లేనా?

మరో రెండు వారాల్లో పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ( Bro Movie ) థియేటర్లలో విడుదల కానుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆంధ్ర హక్కులు అమ్ముడవడం లేదని తెలుస్తోంది.

 Ycp Silence About Pawan Kalyan Bro Movie Details, Ycp, Bro Movie, Pawan Kalyan ,-TeluguStop.com

ఈ సినిమాకు వైసీపీ( YCP ) నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళనకు గురవుతున్నారని సమాచారం అందుతోంది.అయితే బ్రో విషయంలో వైసీపీ సైలెంట్ గా ఉండబోతుందని భోగట్టా.

ఈసారి థియేటర్ల విషయంలో, టికెట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని సమాచారం అందుతోంది.అయితే గ్రామ, వార్డ్ వాలంటీర్ల చేత బ్రో సినిమాకు షాక్ తగిలేలా వైసీపీ వ్యవహరించనుందని సమాచారం అందుతోంది.

బ్రో సినిమా విషయంలో వైసీపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.మరోవైపు ఈ సినిమాకు సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడంతో అభిమానులు ఒకింత ఫీలవుతున్నారు.

Telugu Bro, Og, Pawan Kalyan, Sai Dharam Tej-Movie

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండగా బ్రో సినిమా పవన్ కోరుకున్న విజయాన్ని అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ ఓకే చెప్పిన ఇతర ప్రాజెక్ట్ లకు సంబంధించిన షూటింగ్ త్వరలో మొదలుకానుందని సమాచారం అందుతోంది.పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా( OG Movie ) షూటింగ్ అనుకున్న విధంగా జరుగుతుందో లేదో చూడాలి.ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేయాలని పవన్ భావిస్తున్నారు.

Telugu Bro, Og, Pawan Kalyan, Sai Dharam Tej-Movie

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాల షూటింగ్ లు అంతకంతకూ ఆలస్యం అవుతుండటం గమనార్హం.పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ సత్తా చాటుతుండటం గమనార్హం.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పవన్ సినీ కెరీర్ కు వైసీపీ నుంచి ఏవైనా ఇబ్బందులు కలుగుతాయేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube