బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేపట్టిన అతి రుద్ర మహాయాగంలో అగ్నిప్రమాదం సంభవించింది.చివరి రోజు పూర్ణాహుతిలో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి.
మంటలు పక్కకు వ్యాపించడంతో టెంట్స్, హోమ గుండాలు కాలి బూడిద అయ్యాయి.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.







