Pawan Kalyan : ఆ హీరోయిన్ కి ఖరీదైన బహుమతి ఇచ్చిన పవన్.. ఆ హీరోయిన్ ఎవరంటే?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ప్రస్తుతం ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా అందులో ఇప్పటికే ఒక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

 Pawan Kalyan Costly Diamond Necklace Parvathi Melton-TeluguStop.com

మిగిలిన మూడు సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి.ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడినా కూడా ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావన తీసుకొస్తూనే ఉంటారు.

మాములుగా ఎవరైన రెండో పెళ్లి చేసుకోవడానికే వందసార్లు ఆలోచిస్తారు.అలాంటిది పవన్ ఏకంగా మూడుసార్లు చేసుకున్నాడు.

Telugu Jalsa, Parvathi Melton, Pawan Kalyan, Tollywood-Movie

అందులో ఒకరు తెలుగు, ఇంకొకరు మరాఠీ, మరొకరు రష్యన్.ఇలా ప్రపంచం మొత‍్తాన్ని పవన్ తన పెళ్లిళ్లతో కవర్ చేశాడు.ఈ సంగతి ఇక్కడివరకే అనుకుంటే మీరు పొరబడినట్లే.ఎందుకంటే సినిమా హీరోయిన్లు-పవన్‌కు మధ్య అప్పట్లోనే బోలెడన్ని రూమర్స్ వచ్చాయి.పవన్ ఏ సినిమా చేసినా సరే స్టోరీతో సంబంధం లేకుండా అందులో కచ్చితంగా హీరోయిన్ ఉండి తీరాల‍్సిందే.వకీల్ సాబ్(Vakeel Saab ) సినిమాని ఉదాహరణగా తీసుకోవచ్చు.

స్టోరీకి హీరోయిన్ అవసరం లేదు అయినాసరే శ్రుతిహాసన్‌ని తీసుకొచ్చారు.ఒక పాట, లవ్ ట్రాక్ పెట్టారు.

పవన్ నటించిన సినిమాలలో జల్సా సినిమా కూడా ఒకటి.డైరెక్టర్ త్రివిక్రమ్ పుణ్యామా అని అది హిట్ అయిపోయింది.

Telugu Jalsa, Parvathi Melton, Pawan Kalyan, Tollywood-Movie

ఇకపోతే ఈ సినిమాలో పవన్‌ సరసన ఇలియానా, పార్వతి మెల్టన్( Parvati Melton ) నటించారు.అయితే షూటింగ్ సమయంలో పవన్-పార్వతికి మధ్య ఏదో ఉందని వార్తలు అప్పట్లోనే వచ్చాయి.దానికి ఒక కారణం కూడా ఉంది.అప్పట్లో ఒక పేపర్ లో వచ్చిన కథనం ప్రకారం.జల్సా మూవీ రిలీజైన తర్వాత ఒక సందర్భంలో, హీరోయిన్ పార్వతి మెల్టన్ వద్దంటున్నా కూడా రూ.24 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్‌ని పవన్ ఆమెకి గిఫ్ట్‌గా ఇచ్చాడట.అయితే మొదట డైమండ్ నెక్లెస్‌ని పవన్ ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడో ఏమో అని పార్వతి సింపుల్‌గా నో చెప్పేసిందట.కానీ తనని ఒక ఫ్రెండ్‌లా భావించమని, అలా ఈ నెక్లెస్ తీసుకోమని పవన్ ఆమెతో అన్నాడట.

ఇది జరిగిన తర్వాత వీళ్లిద్దరూ ఒక హోటల్‌లో దాదాపు 2 గంటలు పాటు కలిసి భోజనం చేశారట.అంతే కాకుండా స్వయంగా పార్వతి మెల్టన్‌ని పవన్ తన కారులో ఎక్కించుకుని ఎయిర్ పోర్ట్‌లో డ్రాప్ చేసి వచ్చాడట.

తర్వాత ఏమైందో ఏమో గానీ పార్వతి టాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదు.దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన తాలుకు పేపర్ క్లిప్ తాజాగా మరోసారి వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube