బుల్లితెర యాంకర్ గా కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి వారిలో యాంకర్ సుమ ( Anchor Suma ) ఒకరు.ఇలా ఏ చిన్న సినిమా ఫంక్షన్ జరిగినా కూడా అక్కడ తప్పనిసరిగా సుమ ఉండాల్సిందే.
ఇలా సుమ చేత తమ సినిమాలకు యాంకరింగ్ చేయిస్తే కనుక సినిమాలకు మరింత హైప్ వస్తుందని దర్శక నిర్మాతలు కూడా భావిస్తారు.అందుకే సుమ చేత ఇంటర్వ్యూ చేయించడం లేదా తమ సినిమా ఈవెంట్లకు యాంకర్ గా కూడా ఆమెను సంప్రదిస్తూ ఉంటారు.
ఇలా వరుస సినిమా ఈవెంట్లతో సుమ ఎంతో బిజీగా గడుపుతుంటారు.
సుమ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే కాకుండా ఇంస్టాగ్రామ్ వేదికగా ఎన్నో ఫన్నీ రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అభిమానులను సందడి చేస్తుంటారు.ఇక సుమ ప్రతిసారి తన కుటుంబ సభ్యులు అలాగే తన ఇంట్లో పని చేసే వారిని కూడా తన వీడియోలలో భాగం చేస్తూ ఉంటారు.
తాజాగా ఇలాంటి ఒక ఫన్నీ వీడియోని ( Funny Video ) ఈమె షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
తాజాగా స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లినటువంటి సుమ ప్లేట్లో వివిధ రకాల ఆకుకూరలతో తయారు చేసిన డిష్ ఆర్డర్ చేశారు.అయితే ఈ డిష్ అందరికీ చూపిస్తూ పుష్ప సినిమా( Pushpa Movie ) లో ఓ డైలాగు ఉందంటూ ఆకులు తింటది మేక… మేకను తింటది పులి అనే డైలాగ్ చెబుతూ ఆకులను మేక మాత్రమే కాదు మనుషులు కూడా తింటారు అంటూ తన స్టైల్ లో కామెడీ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.