స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) గురించి మనందరికీ తెలిసిందే.ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం బేబీ.
ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది.సాయి రాజేష్( Sai rajesh ) దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు అనగా జూలై 14న విడుదల కానున్న విషయం తెలిసిందే.
మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎన్‌కేఎన్ నిర్మించారు.విడుదల తేదీకి మరికొన్ని గంటల సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఆనంద్ దేవరకొండ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు.

ఈ క్రమంలోనే ఆయన లిప్ కిస్( Liplock )పై స్పందించారు.ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.ఇందులో లిప్ కిస్సులు ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించగా అందుకు సినిమా చూడాల్సిందే అంటూ సమాధానం ఇచ్చారు.కాగా ఇటీవల ఈ సినిమా నుంచి లిప్ కిస్సులతో కూడిన ఒక పోస్టర్‌ని విడుదల చేసిన నేపథ్యంలో దానిపై ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, అందులో ఆమె పెదాలకు షూగర్, నోట్లో బ్లేడ్ ఉంటుంది.ఆ ముద్దు వెనకాల ప్రేమ ఉంటుందా? పెయిన్ ఉంటుందా? ఆ కిస్ చేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందనే అర్థంలో ఆ పోస్టర్ డిజైన్ చేశామని, ఈ ప్రేమ కథలో అలాంటి అర్థం ఉంటుంది అని వెల్లడించారు ఆనంద్ దేవరకొండ.

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ ఉంటాయి.ఆ ఎమోషన్స్‌ను బాగా చూపించాము.వాటికి ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతారు.ట్రైలర్‌లో చూపించిన ఎమోషన్ కంటే సినిమాలోమరో యాభై శాతం ఎక్కువే ఉంటుంది.థియేటర్లో అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు ఆనంద్ దేవరకొండ.అలాగే బేబీ సినిమాలో మాస్ ఎలిమెంట్లు, కావాల్సిన కమర్షియల్ అంశాలు ఉన్నాయి.
అయితే ఫైట్లు చేయడం, హీరోయిజం, ఎలివేషన్లు ఉంటేనే మాస్ అని నేను అనుకోను, పాత్రల సంఘర్షణలోనూ, కథ నడిచే విధానంలోనూ మాస్ ఉంటుందని అనుకుంటున్నాను అని తెలిపారు ఆనంద్ దేవరకొండ.







