తెలంగాణలో విద్యుత్ వ్యవహారంతో రాజకీయ వేడి రాజుకుంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన సవాల్ ను కోదాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్వీకరించారు.
ఈ మేరకు ఆయన రాజీనామా లేఖతో మునగాల సబ్ స్టేషన్ వద్ద వేచి చూస్తున్నారని తెలుస్తోంది.అయితే 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే సబ్ స్టేషన్ వద్దే రాజీనామా చేస్తానంటూ ఎంపీ కోమటిరెడ్డి నిన్న ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా ఈ సవాల్ ను ఎమ్మెల్యే బొల్లం మలయ్య యాదవ్ స్వీకరించగా.మునగాల సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.







