Deepika Padukone : వామ్మో.. దీపికా పదుకొనే ఏడాదికి అన్నీ రూ.కోట్లు సంపాదిస్తోందా?

బాలీవుడ్ హీరోయిన్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే( Deepika padukone ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

 Actress Deepika Padukone Earns 40 Crores A Year Reportedly-TeluguStop.com

అలాగే బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది.ఇక ఈమె కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.

Telugu Bollywood, Earns, Pathaan, Prabhas Project, Shah Rukh Khan-Movie

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించి బాగానే సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ.అయితే ప్రస్తుతం ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న దీపిక ఏడాదికి ఎంత సంపాదిస్తున్నారు అన్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.కేవలం సినిమాలు కమర్షియల్ యాడ్స్ మాత్రమే కాకుండా ఈమె బిజినెస్ రంగంలో కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే.

కాగా దీపికా ఏడాదికి 40 కోట్లు సంపాదిస్తోంది.సినిమాకు 15 కోట్లు, ఎండోర్స్ మెంట్స్ కి ఏడు నుంచి పది కోట్ల దాకా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇటీవల షారుక్ ఖాన్ ( Shah Rukh Khan )హీరోగా నటించిన పఠాన్ సినిమా( Pathaan movie )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

Telugu Bollywood, Earns, Pathaan, Prabhas Project, Shah Rukh Khan-Movie

ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.కేజిఎఫ్ లాంటి సినిమాల రికార్డులను సైతం బద్దలు కొట్టింది.అలాగే ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే ( Prabhas Project k )సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.ఈ మూవీలో ప్రభాస్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, దీపిక పాత్రకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాతో ఆమె రేంజ్‌ ఇంకో లెవల్‌కి చేరుకోవడం ఖాయం అని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube