కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్ ( Thalapathy Vijay )ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ”లియో”( Leo ) సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూట్ ”వారిసు” రిలీజ్ కాగానే స్టార్ట్ చేయగా ఇప్పటికే పూర్తి అయ్యింది.
ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత నెక్స్ట్ తన 68వ సినిమాను విజయ్ కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో చేయనున్నట్టు ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్టు ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.ఇక లియో సినిమా షూట్ పూర్తి కావడంతో నెక్స్ట్ ఈ సినిమాను కొద్దీ గ్యాప్ తర్వాత స్టార్ట్ చేయనున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ తన పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది.
కాగా విజయ్ తన 68వ సినిమానే లాస్ట్ అని కోలీవుడ్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది.అయితే అది నిజం కాదని నెక్స్ట్ విజయ్ దళపతి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడు అంటూ టాక్ వస్తుంది.
ఈయన క్రేజీ లైనప్ పై కోలీవుడ్ మీడియాలో ఇంట్రెస్టింగ్ విషయాలు వినిపిస్తున్నాయి.
వస్తున్న వార్తల ప్రకారం విజయ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.ఇది పొలిటికల్ డ్రామాగా తెరకెక్కే అవకాశం ఉందని విజయ్ కెరీర్ లో 69 కానీ 70వ ప్రాజెక్ట్ గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.ఇక ఇప్పటికే ఈ కాంబోలో స్నేహితుడు అనే సూపర్ హిట్ సినిమా తెరకెక్కింది.11 ఏళ్ల తర్వాత ఈ కాంబో మళ్ళీ సెట్ అవ్వడంతో ఈ సెన్సేషనల్ కాంబో కోసం అంతా ఎదురు చూస్తున్నారు.