ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో 'గాండీవధారి అర్జున' ప్రీ టీజర్!

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్( Megahero Varuntej ) ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఫుల్ ఫామ్ తో దూసుకు పోతున్నాడు.మధ్యలో ఒకటి అరా ప్లాప్స్ ఎదురైనా కూడా వాటిని లెక్కచేయకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.

 Varun Tej And Praveen Sattaru's 'gandeevadhari Arjuna' Pre Teaser, Gandeevadhari-TeluguStop.com

మరి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా మరో నెలలో రిలీజ్ కానుంది.

ప్రెజెంట్ వరుణ్ తేజ్ క్రేజీ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.మరి ఆ సినిమాల్లో వరుణ్ తేజ్ నటిస్తున్న ”గాండీవధారి అర్జున”( Gaandeevadhari Arjuna ) మూవీ ఒకటి.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ చేస్తామని ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ఆగస్టులో రిలీజ్ ఉండడంతో షూట్ ఫాస్ట్ గా పూర్తి చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.

ఈ క్రమంలోనే తాజాగా ప్రీ టీజర్( Gaandeevadhari Arjuna Pre Teaser ) పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.ఈ టీజర్ ను రేపు అంటే జులై 12న ఉదయం 10 గంటల 8 నిముషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను ఆకట్టు కుంటుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ రిలీజ్ చేసారు.

ఈ రోజు ఉదయం ఈ ప్రీ టీజర్ రిలీజ్ అవ్వగా ఆకట్టుకుంటుంది.

ఈ ప్రీ టీజర్ లో యాక్షన్ సీక్వెన్స్ లు, షూట్ అవుట్ ఇంకా ఛేజ్ సీన్స్ వంటివి చూపించారు.దీంతూ ఈ సినిమా ఎలా ఉంటుందో కొద్దిగా చూపించారు.

ప్రవీణ్ సత్తారు( Praveen Sattaru ) ఎప్పుడు లేని విధంగా వరుణ్ తేజ్ తో కొత్తగా ప్రయోగం చేయనున్నట్టు అనిపిస్తుంది.మరి టీజర్ కమింగ్ సూన్ అని మేకర్స్ అనౌన్స్ చేసారు.

ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య( Sakshi Vaidhya ) హీరోయిన్ గా నటిస్తుండగా.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube