కొత్తిమీర.దీని గురించి పరిచయాలు అవసరం లేదు.ఆకుకూరల్లో కొత్తిమీర ( coriander leaves )ఒకటి.నాన్ వెజ్ వంటల్లో కొత్తిమీరను విరివిరిగా వాడుతుంటారు.అసలు నాన్ వెజ్ వంట్లో కొత్తిమీర పడుకుంటే ఏదో వెలితిగానే ఉంటుంది.వంటలకు చక్కటి రుచి సువాసన అందించడంలో కొత్తిమీరకు మరొకటి సాటి లేదు.
కొందరు నిత్యం వంటల్లో కూడా కొత్తిమీర వినియోగిస్తుంటారు.అయితే వంటలకు మంచి ఫ్లేవర్ ను అందించడమే కాదు కొత్తిమీరలో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కొత్తిమీర పుష్కలంగా ఉంటాయి.అందుకే కొత్తిమీర ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి కొత్తిమీర ఒక వరం అనే చెప్పాలి.అవును రక్తహీనత ఉన్నవారు నిత్యం ఏదో ఒక రూపంలో కొంచెం కొత్తిమీర తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కొత్తిమీరలో ఐరన్ కంటెంట్ మెండుగా ఉంటుంది.అందువల్ల కొత్తిమీరను తీసుకోవడం వల్ల రక్తహీనత బాధితుల్లో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
దీంతో రక్తహీనత సమస్య పరార్ అవుతుంది.అంతేకాదు నిత్యం కొత్తిమీరను తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ( Immunity ) బలపడుతుంది.
శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.వెయిట్ లాస్ అవుతారు.

మధుమేహం ఉన్న వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.గుండె జబ్బులు ( Heart Diseases )వచ్చే రిస్క్ తగ్గుతుంది.కొత్తిమీర లో ఉండే పలు పోషకాలు హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి.కంటి చూపును పెంచుతాయి.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.మరియు చర్మ ఆరోగ్యానికి కూడా కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది.
కాబట్టి వీకెండ్స్ లో వండుకునే నాన్ వెజ్ వంటలకు మాత్రమే కొత్తిమీరను పరిమితం చేయకుండా నిత్యం తీసుకునేందుకు ప్రయత్నించండి.







