స్వాతంత్రోద్యమ కాలం నుంచి ప్రజల జీవితాలతో ముడిపడిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ గత కొన్ని సంవత్సరాలగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితిలను ఎదుర్కొంటుంది .వరుస పెట్టి రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోతూ ఒక సాధారణ ప్రాంతీయ పార్టీలా దాని పరిస్థితి తయారయింది.
కేవలం ఛత్తీస్గడ్ , హిమాచల్ ప్రదేశ్ , రాజస్థాన్లో తప్ప దేశంలో ఇంకెక్కడ అధికారంలో లేని పరిస్థితిని కాంగ్రెస్( Congress ) తెచ్చుకుంది .దీనిలో కొంత కాంగ్రెస్ స్వయంకృతాపరదాలు ఉంటే కొంత కీలక నాయకులను వయసు రీత్యా కోల్పోవడంతో కాంగ్రెస్కి ఈ పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్( Telangana, Andhra Pradesh ) వంటి కీలకమైన రాష్ట్రాలలో తమ నిర్ణయాల వైఫల్యంతో నష్టపోయిన కాంగ్రెస్.అహ్మద్ పటేల్ ,ప్రణబ్ ముఖర్జీ, దిగ్విజయ సింగ్ వంటి ట్రబుల్ షూటర్ లీడర్స్ని వయసు రీత్యా మరణించడంతో కాంగ్రెస్ పార్టీకి వ్యూహ నిపుణుల కొరత కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది.

వీరందరూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనేక రాష్ట్రాలలో విజయం సాధించి పెట్టడానికి అవసరమైన వ్యూహరచనను చేసేవారు .అనేక రాష్ట్రాలలో విజయం సాధించి పెట్టేవారు.బలమైన కోటరీ లా సోనియా( Sonia gandhi ) పక్కన నిలబడి విజయం దిశగా కాంగ్రెస్ ను నడిపించేవారు .ఒకపక్క రాహుల్ గాంధీకి( Rahul Gandhi ) రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోవడం, మరోపక్క సోనియా గాంధీకి వయోభారం మీద పడటం మరోపక్క ప్రాంతీయ పార్టీలు బలపడడంతో కాంగ్రెస్ తన ప్రాబవాన్ని కోల్పోయి తన ఉనికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితికి చేరుకుంది.అయితే ఎలాగోలాగా ఇప్పుడు పరిస్థితులు చక్కబడి రాహుల్ క్రియాశీలక పాత్ర పోషించడం, దేశవ్యాప్త పాదయాత్రలు చేయడం, బాజాపా పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం తో కాంగ్రెస్లో మునుపటి కళ కనిపిస్తుంది .

మరోపక్క కర్ణాటక ( Karnataka )వంటి రాష్ట్రాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో మధ్యప్రదేశ్ , రాజస్థాన్లో తిరిగి అధికారంలోకొచ్చే పరిస్థితులు ఉన్నాయని సర్వే రిపోర్ట్ లు రావడం కాంగ్రెస్ మరొకసారి పునరువైభవం వస్తుందన్న అంచనాలు ఉన్నాయి.తెలంగాణ ఎన్నికలపై కూడా పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం బహుముఖ వ్యూహం తో ముందుకు వెళ్తుంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సిన్సియర్ గా ప్రయత్నిస్తే తెలంగాణను కూడా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదే జరిగితే దేశ రాజకీయ యువనికపై మరొక సారి కాంగ్రెస్ తలుకులీనుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు
.






