టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu )స్టార్ హీరోగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నారనే మనకు తెలిసిందే.అయితే ఈయన తెరపై మాత్రమే కాకుండా హీరో అనిపించుకున్నారు.
ఎంతోమందికి సహాయ సహకారాలు చేయడమే కాకుండా గుండె జబ్బుతో బాధపడే కొన్ని వేల మంది చిన్నారులకు ఈయన ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.అలాగే కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాలలో మౌలిక సదుపాయాల అన్నింటిని అందిస్తున్నారు.
ఇలా నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నటువంటి మహేష్ బాబుకి తన తల్లి ఇందిరా దేవి( Indira Devi ) అంటే ఎంత ప్రేమో చెప్పాల్సిన పనిలేదు.

ఇందిరా దేవి( Indira Devi Death ) గత ఏడాది సెప్టెంబర్ నెలలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.అయితే తన తల్లి మరణించిన సమయంలో మహేష్ బాబు చాలా డిప్రెషన్ కి గురయ్యారు.తన తల్లితో తనకు ఎనలేని ప్రేమ ఉందని మహేష్ బాబు పలు సందర్భాలలో తెలిపారు.
తనకు మనసు బాగా లేకపోయినా తన సినిమా విడుదలకు ముందు తప్పకుండా తన తల్లి ఇంటికి వెళ్లి ఆమె చేత కాఫీ తాగితే తనకు ప్రశాంతంగా ఉంటుందని తన తల్లి పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేశారు.అయితే తన తల్లి బ్రతికుండగానే తన చివరి కోరికను మహేష్ బాబు తీర్చలేదని ఒక వార్త అప్పుడు వైరల్ గా మారింది.

మరి మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి చివరి కోరిక ఏంటి అనే విషయానికి వస్తే తనకు సితార ( Sitara )అంటే చాలా ఇష్టం తను బ్రతికుండగానే సితార ఓణీల ఫంక్షన్ చూడాలని కోరిక ఇందిరా దేవికి ఉండేదట.అయితే ఫంక్షన్ చేయమని మహేష్ బాబుని అడగగా మహేష్ బాబుకి ఇలాంటివి పెద్దగా ఇష్టం ఉండకపోవడంతో తన తల్లి అడిగిన ఈ విషయంపై మౌనంగా ఉన్నారట.ఇలా తన తల్లి చివరి కోరికను తీర్చలేకపోయానని అనంతరం తన తల్లి మరణం తర్వాత ఎంతో బాధపడ్డారు మహేష్ బాబు తన తల్లి చివరి కోరికను తీర్చలేదని తెలుస్తుంది.