పత్తి పంటలో తెల్ల దోమ పురుగుల నివారణకు తీసుకోవలసిన చర్యలు..!

ప్రపంచంలో పత్తిని ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్న దేశాలలో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తుంది.చాలామంది రైతులు పత్తి పంట( Cotton crop )ను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 Steps To Be Taken To Prevent White Gnats In Cotton Crop..! , Cotton Crop, Farm-TeluguStop.com

పత్తి పంటను సస్యరక్ష పద్ధతులలో ఎలా సాగు చేయాలో.పత్తి పంటను ఆశించే తెల్ల దోమ పురుగులను ఎలా నివారించాలో తెలుసుకుందాం.

పత్తి పంట సాగు చేయడానికి ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.తేలకపాటి నేలలు పత్తి సాగు చేయడానికి అనుకూలంగా ఉండవు.రసాయన ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేస్తే అధిక పత్తి దిగుబడి పొందవచ్చు.

Telugu Agriculture, Cotton Crop, Farmers, Latest Telugu, Mille, Sorghum, Trizoph

మార్కెట్లో దొరికే తెగులు నిరోధక మేలైన పత్తి విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.మొక్కలకు సూర్యరశ్మి, గాలి బాగా తగిలే విధంగా దూరంగా నాటుకోవాలి.పత్తి పంటకు బెట్ట తగలకుండా క్రమంగా నీటి తడులు అందించాలి.

పత్తి పంటలో పెసర, జొన్న, మినుము, సోయచిక్కుడు ,వేరుసెనగ, కొర్ర వంటి అంతర పంటలను కూడా సాగు చేయవచ్చు.నేలలో ఉండే తేమశాతాన్ని బట్టి నీటి తడులు అందించవలసి ఉంటుంది.

పొలంలో ఎప్పటికప్పుడు కలుపును పీకేయాలి.

Telugu Agriculture, Cotton Crop, Farmers, Latest Telugu, Mille, Sorghum, Trizoph

పత్తి పంటకు తెల్ల దోమ ( White Gnats )పురుగులు నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఆశిస్తాయి.ఈ దోమల గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్లలు ఆకుల అడుగుభాగాన నిచ్చలంగా నిలిచిపోయి ఆకు రసాన్ని పీల్చడం వల్ల ఆకు పసుపు రంగులోకి మారి ఎండిపోతుంది.అప్పుడు మొక్క గిడస భారీ ఎండిపోతుంది.

ఈ పురుగులు విసర్జించే తేనె లాంటి పదార్థం వల్ల నల్లని బూజు తెగులు వ్యాపిస్తాయి.ఇక ఆకులు, పిందెలు, పూత రాలిపోవడంతో పాటు మొక్కల కూడా పూర్తిగా తగ్గి తీవ్ర నష్టం వస్తుంది.ఈ పురుగుల ఉనికిని గుర్తించి తొలిదశలో ట్రైజోఫాస్ 2.5 మి.లీటర్లను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేస్తే ఈ పురుగులు చనిపోతాయి.అలాకాకుండా ప్రొఫెనోఫాస్ 2మి.లీ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే ఈ తెల్ల దోమ పురుగులను అరికట్టవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube