బోడ కాకర( Boda Kakara ) పంటను డ్రిప్ విధానంలో సాగు చేస్తే అధిక దిగుబడి పొంది మంచి లాభాలు పొందవచ్చు.మార్కెట్లో ఏడాది పొడవునా బోడకాకర కు మంచి డిమాండ్ ఉండడంతో రైతులు( Farmers ) ఈ పంటను సాగు చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ పంటను సాగు చేసే మెలకువలు ఏవో తెలుసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు.ఏమిటో చూద్దాం.
వేసవికాలంలో భూమిని బాగా లోతు దుక్కులు దున్నుకొని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా భూమిని చదును చేసుకోవాలి.ఆ తరువాత పంట అవశేషాలు లేకుండా పొలాన్ని పరిశుభ్రం చేయాలి.
మొక్కల మధ్య దూరంగా ఉండేటట్లు విత్తుకోవాలి.సూర్యరశ్మి, గాలి మొక్కలకు బాగా తగిలితే వివిధ రకాల తెగుళ్ల బెడద ఉండదు.
బోడ కాకరలో ఆడ, మగ అనే రెండు రకాల మొక్కలు ఉంటాయి.ఈ ఆడ, మగ మొక్కలను 10:1 నిష్పత్తిలో నాటుకోవాలి.ఈ మొక్కలు నాటుకున్న 50 రోజుల తర్వాత సూక్ష్మ పోషక ఎరువులను( Micro nutrient fertilizers ), ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
అంతేకాకుండా 10000 పిపియం వేప నూనెను పిచికారి చేస్తే చీడపీడల బెడద ఉండదు.ఒక ఎకరం పొలంలో 20 పసుపు రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి.ఈ పద్ధతులు పాటిస్తే ఎకరాకు 35 క్వింటాళ్ల పంట దిగుబడి పొందవచ్చు.
పైగా మొదటి సంవత్సరం పంట నుంచి సేకరించిన దుంపలను తర్వాతి సంవత్సరంలో పొలంలో నాటుకోవడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది.
ఈ పంటను పందిరి విధానంలో సాగు చేసి, డ్రిప్వి ధానంలో నీటి తడులు అందించాలి.ఒక హెక్టారులో 85 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.మార్కెట్లో ఒక క్వింటాల్ ధర రూ.12000 గా ఉంది.అంటే ఒక హెక్టార్లో పండించిన పంటకు రూ.10 లక్షలకు పైగానే ఆదాయం వస్తుంది.సాగు ఖర్చు రూ.5 లక్షలు అనుకున్న కూడా రూ.5 లక్షల ఆదాయం పొందవచ్చు.