నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్ పరంగా మరింత జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే.కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ నటిస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది.
అయితే ఇప్పుడు ఈ బ్యూటీ కొత్త టెన్షన్ పట్టుకుంది.బాలీవుడ్ లో సమంత( Samantha )`సిటాడెల్` అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మోస్ట్ టాలెంటెడ్ అయిన రాజ్ డీకే ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు.

ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తున్నారు.ఇదొక స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్.ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వబోతోంది.
హాలీవుడ్ లో రూసో బ్రదర్స్ దర్శకత్వంలో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించిన `సిటాడెల్`కు ఇది ఇండియన్ వెర్షన్ అన్న సంగతి తెలిసిందే.
అయితే ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ నటించిన `సిటాడెల్`( Citadel ) కొద్ది రోజుల క్రితం అమోజార్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయింది.
హాలీవుడ్ తో పాటు భారతీయ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేశారు.తెలుగులో కూడా చాలా మంది చూసేశారు.
కానీ, ఈ సిరీస్ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది.యాక్షన్ తరహా స్టోరీతోనే ఈ సిరీస్ ను తెరకెక్కించినా.
ఆడియెన్స్ మెప్పు పొందలేకపోయింది…దాదాపు 250 మిలియన్ డాలర్స్ తో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు.అంటే ఇండియన్ కరెన్సీలో రూ.2000 కోట్లు సిటాడెల్ కోసం ఖర్చు పెట్టాడు.ఇప్పుడు ఆ రెండు వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అయింది.
ప్రైమ్‌లో ఈ సిరీస్ అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కలేదు.దీంతో సమంతకు టెన్షన్ పట్టుకుంది.
ఒరిజినల్ సిరీసే మన దగ్గర ఆడలేదు.అలాంటప్పుడు ఇండియన్ వెర్షన్ పేరిట పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తే మాత్రం సమంత `సిటాడెల్`ను ప్రేక్షకులు ఆధరిస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే అనవసరంగా సమంత `సిటాడెల్`కు సైన్ చేసిందని.ఆమె కష్టం మొత్తం వృథా అవ్వడం ఖాయమని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమంత తెలుగు లో ఖుషి ఒక్కటి మినహా ఇస్తే మరే సినిమా చేయడం లేదు.ఇక పెద్ద హీరో సినిమాల్లో హీరోయిన్ గా అయితే ఇప్పుడు సమంత కి అవకాశం రావడం కష్టమే…ఇక ఇలాంటి టైం లో సమంత రీసెంట్ గా రామ్ చరణ్( Ram Charan )తో రంగస్థలం లాంటి మరో సినిమా చేయాలి అని ఉంది అని సమంత తన సన్నిహితుల దగ్గర అంటున్నట్టుగా నెట్ లో కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి…ఇది చూసిన మరికొందరు సమంత ఇలా అనడానికి ఒక కారణం ఉంది ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాబట్టి ఆయన సినిమాలో చేస్తే ఇంటర్నేషనల్ గా పేరు సంపాదించవచ్చు అని సమంత చూస్తుంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు…
.







