యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇందులో భాగంగా ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం కాలిపోయిన బోగీలను పరిశీలించారు.
అయితే మంటల ధాటికి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో మొత్తం ఏడు బోగీలు పూర్తిగా కాలిపోగా మిగిలిన బోగీలతో ట్రైన్ సికింద్రబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది.హౌరా నుంచి సికింద్రాబాద్ బయలు దేరిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో బొమ్మాయిపల్లిలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.
లోకో ఫైలట్ అప్రమత్తంగా వ్యవహారించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.