ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో షార్టు సర్క్యూట్ కారణంగా రెండు బోగీల్లో మంటలు చెలరేగి దట్టంగా పొగలు అలముకున్నాయి.యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేసి.రెండు బోగీల్లోని ప్రయాణికులను దించేశారు.దీంతో ప్రాణనష్టం తప్పింది.మంటల ధాటికి రెండు బోగీలు దగ్ధమైనట్లు సమాచారం.







