అత్యంత ప్రశాంతమైన దేశాల జాబితా( Peaceful Countries ) తాజాగా విడుదలైంది.ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఎకనామిస్ అండ్ పీస్ సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది.
ఇందులో ఇండియా( India ) వెనుకబడి ఉంది.ఇండియా 123వ స్థానంలో ఉండగా.
ఐస్‌ల్యాండ్( Iceland ) అగ్రస్థానంలో నిలిచింది.ఐస్‌ల్యాండ్ తొలి స్థానాన్ని సంపాదించుకోవడం ఇది తొలిసారి కాదు.
వరుసగా 15వ సారి ఆ దేశం అగ్రస్థానంలో నిలిచింది.అయితే ఇండియాలో గత ఏడాది కాలం నుంచి శాంతి వాతావరణం 3.5 శాతం పెరిగినట్లు తేలింది.

అయితే వరల్డ్ మోస్ట్ పీస్‌పుల్ దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా( America ) 131వ స్థానంలో నిలిచింది.అమెరికాలో గత ఏడాదిగా శాంతి వాతవరణం కొరవడినట్లు ఈ రిపోర్టులో పేర్కొన్నారు.అమెరికాలో హత్యల రేటు బాగా పెరగిపోతున్నట్లు నివేదికలో తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అన్ని దేశాల్లో శాంతియుత వాతావరణం కాస్త తగ్గినట్లు ఈ రిపోర్టు చెబుతోంది.అన్ని దేశాలు సైన్యంతో పాటు ఆయుధారాలను పెంచుకుంటున్న తీరు, భద్రత, సంక్షోభాలను పరిశీలించిన తర్వాత మెస్ట్ పీస్‌ఫుల్ దేశాల జాబితాను సిద్దం చేస్తారు.
ఈ సారి మొత్తం 163 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు.

ఐస్ ల్యాండ్ మరోసారి తొలి స్థానాన్ని నిలుపుకోగా.ఆ తర్వాత రెండో స్థానంలో డెన్మార్క్,( Denmark ) మూడో స్థానంలో ఐర్లాండ్, ( Ireland ) నాలుగో స్థానంలో న్యూజిలాండ్,( New Zealand ) ఐదో స్థానంలో ఆస్ట్రియా ఉన్నాయి.ఇక ఆ తర్వాతి స్థానంలో సింగపూర్, పోర్చుగల్, స్లోవేనియా, జపాన్, స్విట్జర్లాండ్ దేశాలు ఉన్నాయి.
టాప్ 10లో యూరప్‌కు చెందిన దేశాలే ఏడు ఉన్నాయి.అమెరికా మిలటరీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది.
దీంతో ఆ దేశంలో శాంతియుత వాతావరణం కొరవడినట్లు ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఎకనామిస్ అంచనా వేసింది.కాగా ప్రతి ఏడాది ఈ జాబితాను విడుదల చేస్తారు.







